#RRR లో ఎన్టీఆర్,చరణ్ పాత్రలు ఇవే

195

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కబోతున్న మల్టీస్టారర్ మూవీ రెడీ అయ్యింది. బాహుబలి తర్వాత ఆ స్థాయికి తగిన విధంగా సినిమా ప్లాన్ చేసిన రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్‌ కలయికతో రేర్ కాంబినేషన్ సెట్ చేశారు. మెగా, నందమూరి అభిమానుల సపోర్టుతో ఈ సినిమా ఏ స్థాయికి వెళుతుందో ఎవరూ ఊహించలేక పోతున్నారు.రాజమౌళి లాంటి బడా దర్శకుడి చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్ నటిస్తుండడంతో ఈ చిత్రం సౌత్ లోనే క్రేజీ మల్టీస్టారర్ గా మారిపోయింది. బాహుబలి చిత్రాన్ని మించేలా 300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related image

ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ నవంబర్‌లో మొదలై డిసెంబర్ ప్రథమార్థంలో పూర్తైంది.అనంతరం రాజమౌళి తనయుడి వివాహం కారణంగా కాస్త గ్యాప్ తీసుకున్న ఈ చిత్రబృందం రెండో షెడ్యూల్ ను సోమవారం ప్రారంభించింది. అయితే ఇప్పటికే ఈ చిత్రంలోని హీరోల పాత్రలపై అనేక కథనాలు హల్‌చల్ చేశాయి.

Image result for #RRR

తాజాగా మరో కథనం ఫిలింనగర్‌లో చెక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడట. అడవి దొంగగా ఆయన పాత్ర సాగుతుందని.. ఎన్టీఆర్‌ను పట్టుకునే పాత్రలో చెర్రీ కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై నిజానిజాలు తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.