హరికృష్ణ సాక్షిగా కొడుకు పేరు మార్చిన ఎన్టీఆర్.. ఏం పేరు పెట్టాడో తెలిస్తే..

465

సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు. నెల్లూరు జిల్లాలో ఓ అభిమాని వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి ఫార్చ్యునర్ వాహనంలో బయల్దేరిన ఆయన నల్లగొండ జిల్లా అన్నెపర్తి దగ్గర ప్రమాదానికి గురయ్యారు. నార్కెట్ పల్లిలోని కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.నిన్న సాయంత్రం అంతక్రియలు ముగిసాయి.

Image result for harikrishna

అయితే అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లిన ఎన్టీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు.ఆ నిర్ణయం అటు ఎన్టీఆర్ అభిమానులకే కాదు నందమూరి అభిమానులందరికి ఆనందాన్ని కలిగిస్తుంది.మరి ఎన్టీఆర్ తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటో చూద్దామా.ఎన్టీఆర్ కు ఇద్దరు కొడుకులు అని మనకు తెలుసు.పెద్ద కుమారుడి పేరు అభయ్ రామ్ అని చిన్న కొడుకు పేరు భార్గవ రామ్ అని మనకు తెలుసు.జాతకరీత్యా వీరికి ఈ పేర్లు పెట్టాడు.అయితే ఇప్పుడు ఎన్టీఆర్ తన కొడుకు పేరు విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు.అదేమిటి అంటే.. ఎన్టీఆర్ తన రెండవ కొడుకు పేరు మార్చాలని అనుకుంటూన్నాడంట.తన తండ్రి పేరును తన కొడుకును పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.రెఅందవ కొడుకు పేరు భార్గవ రామ్ ఇది జాతకరీత్యా పెట్టారు.

Image result for jr ntr with sons

 

ఇప్పుడు తన తండ్రి హరికృష్ణ పేరు కూడా కలిసేవిధంగా రెండవ కొడుకు పేరు పెట్టాలని అనుకుంటున్నాడంట..ఈ విషయం గురించి అన్న కళ్యాణ్ రామ్ దగ్గర కుటుంబ సభ్యుల దగ్గర కూడా చర్చించినట్టు తెలుస్తుంది.అందరు ఎన్టీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారని తెలుస్తుంది.అలాగే తన తండ్రి పేరున ఒక ఛారిటీని పెట్టి పేదవాళ్లకు సహాయం చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది.అలాగే ఎన్టీఆర్ సొంత ఊరు నిమ్మకూరు అంటే హరికృష్ణకు ఎంతో ఇష్టం.ఆ ఊరి కోసం హరికృష్ణ ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాడు.

త్వరలోనే అన్ని సమస్యలను తీరుస్తా అని ఆ గ్రామ ప్రజలకు మాట ఇచ్చాడంట.అయితే ఇచ్చిన మాట నెరవేరకముందే హరికృష్ణ చనిపోయాడు.కాబట్టి నిమ్మకూరు అభివృద్ధికి కూడా పాటు పడాలని అన్నదమ్ములిద్దరూ నిర్ణయించుకున్నారట.అయితే కొడుకు పేరు మార్చాలన్నా ఎన్టీఆర్ నిర్ణయం పట్ల అందరు సంతోషము వ్యక్తం చేస్తున్నారు.మరి ఎన్టీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం గురించి అలాగే ఎన్టీఆర్ చెయ్యబోయే మంచి పనుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.