ఎన్టీఆర్ చిత్ర ట్రైలర్ నా భూతొ నా భవిష్యత్…

250

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.బాలయ్య నిర్మిస్తున్నాడు. జ్ఞాన‌శేఖ‌ర్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ పాత్రను బాలయ్య పోషిస్తుండగా ఎన్టీఆర్ సతీమని బసవతారకం పాత్రలో విద్యా బాలన్, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా, అక్కినేని పాత్రలో సుమంత్ ,హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.అలాగే రకుల్ నిత్యామీనన్ కైకాల సత్యనారాయణ ప్రకాష్ రాజ్ లాంటి నటులు నటిస్తున్నారు.

Related image

ఎన్టీఆర్ నట జీవితాన్ని ఎన్టీఆర్ కథానాయకుడిగా, రాజకీయ జీవితం ఆధారంగా ఎన్టీఆర్ మహానాయకుడిగా వెండితెరపై చూపించనున్నారు.ఈ చిత్ర ఆడియో నిన్న విడుదల అయ్యింది.చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ‘నేను ఉద్యోగం మానేశాను..ఎందుకు మానేశావు..నచ్చలేదు..మరేం చేద్దామని..సినిమాల్లోకి వెళతాను..నిన్ను చూడటానికి జనాలు టికెట్లు కొనుక్కొని థియేటర్లకు వస్తున్నారు..ఇలా నువ్వే వెళ్లి కనిపిస్తే నీ సినిమాలు ఎవరు చూస్తారు..జనం కోసమే సినిమా అనుకున్నాను..ఆ జనానికే అడ్డమైతే సినిమా కూడా వద్దంటాను’ అంటూ వచ్చే డైలాగ్స్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్నాయి.

ఓ వైపు సినిమాలు..మరో వైపు రాజకీయ ప్రస్తానం రెండింటిని చూపిస్తూ రూపొందించిన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.ఎన్టీఆర్ కొడుకులు కూతుళ్లు అందరు ఈ వేడుకకు వచ్చారు.మొదటి భాగం ‘కథానాయకుడు’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయనుండగా..‘మహానాయకుడు’ సినిమా రిపబ్లిక్ డే కానుకగా ఫిబ్ర‌వ‌రి 7న‌ విడుదల కానుంది.