మరో సర్‌ప్రైజ్ ఇవ్వనున్న ఎన్టీఆర్ బయోపిక్ టీమ్ .. ముహూర్తం ఫిక్స్

260

మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ దివంగత ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’ .క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.బాలయ్య నిర్మిస్తున్నాడు.ఇందులో ఎన్టీఆర్ పాత్రను బాలయ్య పోషిస్తుండగా ఎన్టీఆర్ సతీమని బసవతారకం పాత్రలో విద్యా బాలన్, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా, అక్కినేని పాత్రలో సుమంత్ ,హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Image result for ntr biopic second song

ఎన్టీఆర్ నట జీవితాన్ని ఎన్టీఆర్ కథానాయకుడిగా, రాజకీయ జీవితం ఆధారంగా ఎన్టీఆర్ మహానాయకుడిగా వెండితెరపై చూపించనున్నారు.షూటింగ్ శరవేగంగా జరపుకుంటోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేస్తూ రోజుకో సర్‌ప్రైజ్‌తో ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకుంటున్నారు.

Image result for ntr biopic second song

ఇటీవలే చిత్రంలోని ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయగా.. దానికి ప్రేక్షకులు నీరాజనం పలికారు. సోషల్ మీడియాలో ఈ సాంగ్ భారీ స్పందన తెచ్చుకుంది. తాజాగా రెండో సాంగ్‌తో సర్‌ప్రైజ్ చేసేందుకు సిద్ధమైంది చిత్రయూనిట్. ‘‘రాజర్షి’’ అనే ఈ సాంగ్‌ను డిసెంబర్ 12వ తేదీన 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో విడుదల చేస్తున్నామని ప్రకటించారు.