‘యన్‌టీఆర్‌’లో రానా ఫస్ట్‌లుక్‌ .. చంద్రబాబుగా రానా లుక్ అదుర్స్.

368

తెలుగు వాళ్లందరికీ ఇలవేల్పు అయినా నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కుతున్న సంగతి మన అందరికి తెలిసిందే.ఈ సినిమాలో బాలకృష్ణ తన తండ్రి పాత్రను చేస్తున్నాడు.విద్యాబాలన్ కైకాల సత్యనారాయణ,రానా,సుమంత్ లాంటి నటులు ఇందులో నటిస్తున్నారు.

Image result for ntr biopic rana first look

‘యన్‌టీఆర్’ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు.శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ జరుపుకొంటోంది.‘యన్‌టీఆర్‌’ బయోపిక్‌లో రానా..ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రంలో చంద్రబాబుగా రానా లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

1984లో చంద్రబాబు లుక్‌ ఇలా ఉండేది అంటూ రానా ట్విటర్‌ ద్వారా దీనిని విడుదల చేశారు.రానా పాత్రకు సంబంధించిన చిత్రీకరణ అబిడ్స్‌లోని ఎన్టీఆర్‌ నివాసం నుంచే మొదలైంది.వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.