ఎన్టీఆర్ బయోపిక్ మరొక పోస్టర్ రిలీజ్ : 60 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఎలా ఉన్నాడో అలా బాలయ్య

248

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.బాలయ్య నిర్మిస్తున్నాడు. జ్ఞాన‌శేఖ‌ర్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ పాత్రను బాలయ్య పోషిస్తుండగా ఎన్టీఆర్ సతీమని బసవతారకం పాత్రలో విద్యా బాలన్, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా, అక్కినేని పాత్రలో సుమంత్ ,హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Image result for ntr biopic

ఎన్టీఆర్ నట జీవితాన్ని ఎన్టీఆర్ కథానాయకుడిగా, రాజకీయ జీవితం ఆధారంగా ఎన్టీఆర్ మహానాయకుడిగా వెండితెరపై చూపించనున్నారు.జనవరి 9 న చిత్రం విడుదల కానుంది. ఫిబ్రవరి 7న రెండో భాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ రిలీజ్ కానుంది. భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్స్ ఎప్పటినుంచో మొదలు పెట్టేశారు. ఇప్పటికే పలు పోస్టర్స్, వీడియోస్ రూపంలో తండ్రి పాత్రలో బాలయ్య ఎలా ఒదిగిపోయాడో చూసేసింది ప్రేక్షక లోకం. అయితే తాజాగా మరో పోస్టర్ రిలీజ్ చేసి ప్రేక్షకలోకాన్ని మంత్రముగ్దుల్ని చేసింది చిత్రయూనిట్.

Image result for ntr biopic venkateswara mahatyam balayya postar

ఈ పోస్టర్‌లో వెంకటేశ్వర స్వామి అవతారంలో బాలయ్య కనిపిస్తున్నారు. స్వామి అవతారంలో సరిగ్గా సూట్ కావటమే గాక అప్పట్లో ఇదే వేషంలో ఎన్టీఆర్ ఎలా ఉన్నారో.. అచ్చు అలాగే దర్శనమిచ్చి ఆశ్చర్యపరిచారు.దాదాపు 60 సంవత్సరాల క్రితం వచ్చిన ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’ సినిమాలో వెంకటేశ్వర స్వామి వేషం ధరించి జనం మనసు దోచుకున్నారు ఎన్టీఆర్.అలనాటి ఘట్టాన్ని మరోసారి నేటి ప్రేక్షకుల ముందుంచాలనే దృక్పథంతో బాలయ్యతో ఏడుకొండలవాడి వేషం వేయించారట డైరెక్టర్ క్రిష్.