ఎన్టీఆర్ ప్రోమో : అమ్మ చెప్పిందంటూ అలరించిన కళ్యాణ్ రామ్

229

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.బాలయ్య నిర్మిస్తున్నాడు. జ్ఞాన‌శేఖ‌ర్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ పాత్రను బాలయ్య పోషిస్తుండగా ఎన్టీఆర్ సతీమని బసవతారకం పాత్రలో విద్యా బాలన్, రానా, సుమంత్ ,కళ్యాణ్ రామ్, రకుల్ , నిత్యామీనన్, కైకాల సత్యనారాయణ ప్రకాష్ రాజ్ లాంటి నటులు నటిస్తున్నారు.

Related image

ఎన్టీఆర్ నట జీవితాన్ని ఎన్టీఆర్ కథానాయకుడిగా, రాజకీయ జీవితం ఆధారంగా ఎన్టీఆర్ మహానాయకుడిగా వెండితెరపై చూపించనున్నారు.జనవరి 9 న చిత్రం విడుదల కానుంది. ఫిబ్రవరి 7న రెండో భాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ రిలీజ్ కానుంది.భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్స్ ఎప్పటినుంచో మొదలు పెట్టేశారు.

తాజాగా ఓ ప్రోమో వీడియో విడుదల చేశారు. ఇందులో చూపించిన సన్నివేశం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బాలకృష్ణ(ఎన్టీఆర్) కార్ డోర్ తీసి ముందు సీట్లో కూర్చోబోతుండగా.. పక్కనే ఉన్న కళ్యాణ్ రామ్(హరికృష్ణ).. ‘‘మీకు అమ్మకు రెండు ఇష్టాలు ఉండవటగా! అమ్మ చెప్పింది’’ అనటంతో.. వెంటనే ఆ డోర్ క్లోస్ చేసి వెనుక సీట్లో కూర్చున్న విద్యాబాలన్(బసవతారకం) పక్కన కూర్చునేందుకు బాలకృష్ణ(ఎన్టీఆర్) వెళ్తున్నట్లుగా ఈ ప్రోమోలో చూపించారు. ఒకే ఒక్క డైలాగ్‌తో కూడిన ఈ అద్భుతమైన దృశ్యం నందమూరి అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.