ఎన్టీఆర్ బయోపిక్ పోస్టర్ : హన్సిక, బాలయ్య స్టిల్ సూపర్

244

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.బాలయ్య నిర్మిస్తున్నాడు. జ్ఞాన‌శేఖ‌ర్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ పాత్రను బాలయ్య పోషిస్తుండగా ఎన్టీఆర్ సతీమని బసవతారకం పాత్రలో విద్యా బాలన్, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా, అక్కినేని పాత్రలో సుమంత్ ,హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.అలాగే రకుల్ నిత్యామీనన్ కైకాల సత్యనారాయణ ప్రకాష్ రాజ్ లాంటి నటులు నటిస్తున్నారు.

Image result for ntr biopic hansika balayya poster

ఎన్టీఆర్ నట జీవితాన్ని ఎన్టీఆర్ కథానాయకుడిగా, రాజకీయ జీవితం ఆధారంగా ఎన్టీఆర్ మహానాయకుడిగా వెండితెరపై చూపించనున్నారు.జనవరి 9 న చిత్రం విడుదల కానుంది. ఫిబ్రవరి 7న రెండో భాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ రిలీజ్ కానుంది.భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్స్ ఎప్పటినుంచో మొదలు పెట్టేశారు. ఇప్పటికే పలు పోస్టర్స్, వీడియోస్ రూపంలో తండ్రి పాత్రలో బాలయ్య ఎలా ఒదిగిపోయాడో చూసేసింది ప్రేక్షక లోకం.

Image result for ntr biopic hansika balayya poster

అయితే తాజాగా మరో పోస్టర్ రిలీజ్ చేసి ప్రేక్షకలోకాన్ని మంత్రముగ్దుల్ని చేసింది చిత్రయూనిట్. అప్పట్లో ఎన్టీఆర్ నటించిన ‘యమగోల’ సినిమాలోని స్టిల్ బయటకు వదిలారు. అప్పుడు ఎన్టీఆర్, జయప్రద జోడీ ఎలా ఉందో.. అచ్చు అలాగే ఉంది బాలకృష్ణ, హన్సిక జోడీ.. అంటున్నారు ఈ స్టిల్ చూసిన ప్రేక్షకులు. అంతేకాదు ఈ స్టిల్ కన్నుల పండుగగా, చూడముచ్చటగా ఉందని కితాబిస్తున్నారు.