రెండు భాగాలుగా రాబోతున్న బయోపిక్‌..‘యన్‌టిఆర్‌’ పార్ట్‌ 1: కథానాయకుడు

236

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్‌ జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యన్‌టిఆర్’. క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.బాలకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.విద్యాబాలన్‌, రానా, సుమంత్‌ కీలక పాత్రలు పోషిసున్నారు. సావిత్రి పాత్రలో నిత్యమేనన్‌ నటిస్తున్నారు.ఇందులో ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు.

Image result for ntr biopic

ఎన్టీఆర్ బయోపిక్‌ను రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారట. ఈ విషయాన్ని క్రిష్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటిస్తూ తొలి భాగం టైటిల్‌ పోస్టర్‌ను పంచుకున్నారు.తొలి భాగం సినిమాను ‘యన్‌టిఆర్‌ కథానాయకుడు’ టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. ‘ప్రతి కథకీ ఓ నాయకుడుంటాడు. కానీ కథగా మారే నాయకుడొక్కడే ఉంటాడు’ అని వెల్లడిస్తూ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు.

Image result for ntr biopic

తొలి భాగాన్ని వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రెండో భాగానికి ‘యన్‌టిఆర్‌ రాజకీయనాయకుడు’ అనే టైటిల్‌తో విడుదల చేస్తారని తెలుస్తోంది. తొలి భాగం విడుదలైన కొన్ని రోజుల వ్యవధిలోనే రెండో భాగాన్ని కూడా విడుదల చేస్తారట.