‘ఎన్టీఆర్’ ట్రైలర్, ఆడియో రిలీజ్ డేట్స్ వివరాలు

275

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.బాలయ్య నిర్మిస్తున్నాడు. జ్ఞాన‌శేఖ‌ర్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Image result for ntr biopic

ఇందులో ఎన్టీఆర్ పాత్రను బాలయ్య పోషిస్తుండగా ఎన్టీఆర్ సతీమని బసవతారకం పాత్రలో విద్యా బాలన్, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా, అక్కినేని పాత్రలో సుమంత్ ,హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.అలాగే రకుల్ నిత్యామీనన్ కైకాల సత్యనారాయణ ప్రకాష్ రాజ్ లాంటి నటులు నటిస్తున్నారు. ఎన్టీఆర్ నట జీవితాన్ని ఎన్టీఆర్ కథానాయకుడిగా, రాజకీయ జీవితం ఆధారంగా ఎన్టీఆర్ మహానాయకుడిగా వెండితెరపై చూపించనున్నారు.

ఇప్పటి వరకు విడుదలైన ప్ర‌తీ లుక్ కూడా సినిమాపై అంచ‌నాలు పెంచేస్తుంది. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాట‌ల‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వస్తున్న విషయం తెలిసిందే..ఎన్టీఆర్ బ‌యోపిక్ ట్రైల‌ర్ హైద‌రాబాద్‌లో ఆడియో రిలీజ్ ఈవెంట్ నంద‌మూరి తార‌క‌రామారావు పుట్టిన ఊరు నిమ్మ‌కూరులో జ‌ర‌గ‌నున్నాయి. డిసెంబ‌ర్ 16న ట్రైల‌ర్ లాంచ్ 21న ఆడియో వేడుకను గ్రాండ్‌గా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర‌యూనిట్.