ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుక తిరుపతిలో..

276

మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ దివంగత ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’ .క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.బాలయ్య నిర్మిస్తున్నాడు.ఇందులో ఎన్టీఆర్ పాత్రను బాలయ్య పోషిస్తుండగా ఎన్టీఆర్ సతీమని బసవతారకం పాత్రలో విద్యా బాలన్, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా, అక్కినేని పాత్రలో సుమంత్ ,హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Related image

ఎన్టీఆర్ నట జీవితాన్ని ఎన్టీఆర్ కథానాయకుడిగా, రాజకీయ జీవితం ఆధారంగా ఎన్టీఆర్ మహానాయకుడిగా వెండితెరపై చూపించనున్నారు.షూటింగ్ శరవేగంగా జరపుకుంటోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో దర్శక నిర్మాతలు చిత్ర ప్రచారాలపై దృష్టి సారించారు. త్వరలో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని చూస్తున్నారు.

Image result for ntr biopic

దీనిలో భాగంగా తొలుత ఆడియో విడుదల వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ 16న ఆడియో విడుదల వేడుక నిర్వహించనున్నారు. ఆధ్యాత్మిక నగరం, శ్రీవేంకటేశ్వరుడి సన్నిధి అయిన తిరుపతిలో ‘యన్.టి.ఆర్ – కథానాయకుడు’ ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ మహా వేడుకకు తెలుగు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.