రోబో 2.0 కి పాకిస్తాన్ లో ఇలా జరిగుతుందని ఎవ్వరూ ఊహించిఉండరు.. షాక్ లో రజిని, శంకర్

523

ఇండియన్ సూపర్‌స్టార్స్ రజనీకాంత్, అక్షయ్ కుమార్ కాంబినేషన్‌లో దర్శకుడు శంకర్ రూపొందించిన 2.0 చిత్రానికి భారీ స్పందన లభిస్తున్నది. తొలి రోజు దేశవ్యాప్తంగా టికెట్ కౌంటర్లు కిక్కిరిసిపోయి కనిపించాయి. రిలీజైన ప్రతీ చోట 95 శాతానికి పైగా అక్యుపెన్సీ ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. శంకర్ విజన్, ఆలోచనకు ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మ్యాజిక్ చేసింది.అయితే ఈ సినిమా ఇప్పుడు పాకిస్థాన్ లో కూడా సంచలనాలను క్రియేట్ చేస్తుంది.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for robo 2.0

2.0 చిత్రం నిన్న గ్రాండ్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. 2.0 చిత్రం ప్రపంచవ్యాప్తంగా 10500 స్క్రీన్లలో విడుదలైంది. ఉత్తర అమెరికాలో 850 స్క్రీన్లలో, యూకేలో 300, యూరప్‌లో 500, యూఏఈలో 350, దక్షిణాసియాలో 100, ఇండియాలో 7500, ఇతర ప్రాంతాల్లో 900 స్క్రీన్లలో రిలీజ్ అయింది. మొదటి రోజు 35 వేల షోలు ప్రదర్శించారు.. రిలీజైన ప్రతీ చోట మంచి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తున్నది. విజువల్ వండర్ హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో సినిమా అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ దూసుకెళుతోంది. హిందీ వెర్షన్‌కు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. అయితే కేవలం ఇండియాలోనే కాదు, దాయాది దేశం పాకిస్థాన్లో కూడా ఈ సినిమాకు డిమాండ్ అదిరిపోతోంది.పాకిస్థాన్లో 2.0 చిత్రాన్ని 15 నుంచి 20 థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే అడ్వాన్స్ బుకింగ్ లోనే టికెట్స్ అన్నీ అమ్ముడయ్యాయి. సినిమాకు డిమాండ్ భారీగా ఉండటంతో పాకిస్థాన్ వ్యాప్తంగా ఈ స్క్రీన్ల సంఖ్యను 75కు పెంచారు.

పాకిస్థాన్‌లో రజనీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 2016లో కబాలి సినిమా విడుదలైనప్పటి నుంచి సూపర్ స్టార్ ఫాలయింగ్ మరింత పెరిగింది. పాకిస్థాన్లో కాబాలి అప్పట్లో మంచి వసూళ్లు సాధించింది. ఇండియా, పాకిస్థాన్‌తో పాటు యూఎఈ, న్యూజియాలాండ్ లాంటి చోట్ల సినిమాకు డిమాండ్ బాగా ఉండటంతో అదనపు స్క్రీన్లు జత చేశారు. ఫస్ట్ వీకెండ్ భారీ వసూళ్లు నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు. రూ. 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘బాహుబలి 2′ ఫుల్ రన్‌లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 1810 కోట్లు రాబట్టింది. దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన 2.0 చిత్రం బాహుబలి రికార్డులను బద్దలు కొడుతుందా? లేదా? అనే ఆసక్తి అందిరిలోనూ నెలకొంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరి ఈ విషయం గురించి మీరేమంటారు.రజని 2.ఓ చిత్రం గురించి అలాగే పాకిస్తాన్ తో సహా విడుదల అయినా అన్ని దేశాలలో ఈ సినిమా స్పృష్టిస్తున్న భీభత్సము గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.