జనసేన కోసం నితిన్ చేసిన పనికి కుప్పకూలిపోయిన పవన్ కళ్యాణ్

397

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కేవలం సామాన్య ప్రజలు మాత్రమే కాదు.. పలువురు యంగ్ హీరోలు కూడా ఉన్నారు. అందులో ప్రధానంగా చెప్పగలిగే పేరు యంగ్ హీరో నితిన్. పవన్ కళ్యాణ్‌ సినిమాలు చూసి ఇన్‌స్పైర్ అయి సినిమా రంగంలోకి వచ్చిన ఈ యువ నటుడు పవన్ కళ్యాణ్ పట్ల తన అభిమానం చాటుకున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలను వదిలేసి.. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో రాజకీయాల్లో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనవంతు సహాయంగా ఆయన రాజకీయ జర్నీకి ఆర్థిక చేయూతనివ్వాలనుకున్నారు నితిన్. ఆయనపై తన అభిమానాన్ని చాటుకుంటూ భారీ విరాళం ప్రకటించారు.

Image result for pawan kalayan and nithin

‘జనసేన పార్టీకి హీరో నితిన్ రూ.25 లక్షల విరాళం అందించారు’ అని జనసేన పార్టీ అఫీషియల్‌గా ప్రకటించింది. అయితే తన విరాళం గురించి నితిన్ ఎక్కడా చెప్పుకోక పోవడంతో స్వయంగా పార్టీ వారే ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం. ఈ మధ్య సరైన హిట్లు లేక పోయినా, ప్లాపుల్లో ఉన్నప్పటికీ నితిన్ ఇంత భారీ మొత్తం ఇవ్వడం చర్చనీయాంశం అయింది. స్నేహ బంధాన్ని గాలికి వదిలిన వ్యక్తి ఒకవైపు..అభిమానాన్ని చాటుకున్న వ్యక్తి మరో వైపు నితిన్ విరాళంపై అభిమానులు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘పార్టీ గెలుపోటముల మీద అనుమానంతో స్నేహ బంధాన్ని గాలికి వదిలిన వ్యక్తి ఒకవైపు, పార్టీని ఆర్ధికంగా ఆదుకుంటూ అభిమానాన్ని చాటుకున్న వ్యక్తి నితిన్ ఒక వైపు. గుర్తుపెట్టుకుంటాం” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు అలీ, నితిన్‌ను ఉద్దేశించి చేసినవని స్పష్టమవుతోంది.

ఈ క్రింది వీడియో చూడండి

‘‘మరోసారి మాలాంటి వాళ్ళు గర్వపడే నిజమైన అభిమాని అనిపించుకున్నావ్.. పొగిడిన నోళ్ళన్నీ ఎవరో మెప్పుకోసం నేడు మా కళ్యాణ్ అన్నను తెగుడుతుంటే అభిమాని ఎప్పటికీ అభిమానే అనిపించేట్టు ప్రత్యర్థుల చెంప చెళ్లుమనేట్టు సమాధానం ఇచ్చావ్ నితిన్ అన్నా.. నీకు ఋణపడి ఉంటాం నేస్తం మేమంతా…” అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ‘ఎంతో మంది వాడుకున్నారు కళ్యాణ్ పేరు, కొంత మందే లాయల్‌గా ఉన్నారు.. అందరినీ గుర్తు పెట్టుకుంటాం, ఎన్నికల తర్వాత చెప్తాం సమాధానం.’ అంటూ పలువురు అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘మీ సినిమాల ప్రచారాలకి పవన్ కళ్యాణ్‌ను, ఆయన ఫాన్స్‌ని వాడుకుంటున్నారు అనే వారికి ఒకే ఒక్క దెబ్బతో మంచి సమాధానం ఇచ్చారు. కులం, ప్రాంతం బేధం లేకుండా జనసేన‌కి మద్దతు ఇవ్వడం గొప్ప విషయం. ఒక మెట్టు ఎక్కేసావ్ నితిన్.” అంటూ ఫ్యాన్స్ ప్రశంసలు గుప్పిస్తున్నారు. ‘మన కుటుంబం దాటి ఒక వ్యక్తిని నిస్వార్థంగా, అమితంగా ప్రేమించటమే అభిమానం, ఇది వెల కట్టలేని ప్రేమ. మీ అభిమానానికి, ప్రేమకి కోటి దండాలు నితిన్ గారు.’ అంటూ పికె ఫ్యాన్స్ తమ మనసులోని మాటను బయట పెడుతున్నారు.

Image result for pawan kalayan and nithin

గతంలో నితిన్ తన సినిమా వేడుకలో నితిన్ మాట్లాడుతూ…. ‘‘తొలిప్రేమ చూసిన త‌ర్వాతే నేను హీరో కావాల‌ని అనుకున్నాను. పవన్ కళ్యాణ్ చూస్తూ పెరిగిన నేను ఆయన్ను స్పూర్తిగా తీసుకుని ఇండస్టీకి వచ్చాను. అభిమానిగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులో బ్యాన‌ర్లు క‌ట్టా, టిక్కెట్ల కోసం బ‌ట్ట‌లు చింపుకున్నాను, థియేటర్లో పేపర్లు ఎగరేసాను. నాకు ఇండస్ట్రీలో పెద్ద strength ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌గారు.” అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. జనసేన పార్టీకి నితిన్ ఇచ్చిన విరాళంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..