ఎన్టీఆర్ బయోపిక్ లో సావిత్రిగా నిత్యామీనన్ ఫస్ట్ లుక్ కేక..

260

మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ దివంగత ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’ .క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.బాలయ్య నిర్మిస్తున్నాడు.ఇందులో ఎన్టీఆర్ పాత్రను బాలయ్య పోషిస్తుండగా ఎన్టీఆర్ సతీమని బసవతారకం పాత్రలో విద్యా బాలన్, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా, అక్కినేని పాత్రలో సుమంత్ ,హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

 సంక్రాంతికి కథానాయకుడు

ఈ చిత్రానికి సంబంధించి రోజుకో ఆసక్తికర విషయం వెలుగులోకి వస్తోంది.ఎన్టీఆర్ నట జీవితాన్ని ఎన్టీఆర్ కథానాయకుడిగా, రాజకీయ జీవితం ఆధారంగా ఎన్టీఆర్ మహానాయకుడిగా వెండితెరపై చూపించనున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ నట, రాజకీయ జీవితంలో ఆయనతో సంబంధమున్న కీలక పాత్రలను తెరకెక్కించారు.తాజాగా ఈ చిత్రంలో సావిత్రి పాత్ర చేస్తున్న నిత్యామీనన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

సావిత్రి గెటప్ లో నిత్యామీనన్ అదుర్స్ అనిపించే విధంగా ఉంది. తాజాగా నిత్యామీనన్ ఫస్ట్ లుక్ ఎన్టీఆర్, ఏఎన్నార్ గుండమ్మ కథ చిత్రంలోనిది. ఆ చిత్రంలోని లేచింది మహిళా లోకం అనే సూపర్ హిట్ సాంగ్ కి సంబందించినది ఈ స్టిల్. ఎన్టీఆర్ పాత్రలో ఉన్న బాలయ్య పిండి రుబ్బుతుండగా సావిత్రి నిలుచుని చూస్తూ ఉంది. ఈ ఫస్ట్ లుక్ ని నిత్యామీనన్ ట్విట్టర్ లో విడుదల చేసింది. సావిత్రి అమ్మగా నేను నటిస్తుండడం గర్వంగా ఉంది అంటూ నిత్యామీనన్ పేర్కొంది.