గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో నితిన్, సుకుమార్ సినిమా..

285

యంగ్ హీరో నితిన్ వరుస చిత్రాలతో బిజీ అవుతున్నాడు. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శత్వంలో నితిన్ నటించేందుకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. చంద్రశేఖర్ ఏలేటి దర్శత్వంలో కూడా నితిన్ నటించబోతున్నాడట.ఇప్పుడు నితిన్ సుకుమార్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది.

నితిన్ వరుస చిత్రాలు

నితిన్ కోసం సుకుమార్ ఓ ఆసక్తికరమైన కథని రూపొందించాడు. కుమారి 21 ఎఫ్ చిత్రంతో దర్శకుడిగా నిరూపించుకున్న సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది.మెగా నిర్మాత అల్లు అరవింద్ నడిపిస్తున్న గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఈ చిత్రం రూపొందబోతోందట.

నితిన్ హీరోగా

మెగా కాంపౌండ్ లోని నిర్మాత బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తాడని అంటున్నారు. ఈ చిత్రాన్ని త్వరలో ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.