విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న నితిన్, రాశీ ఖన్నా,దిల్ రాజు…

342

నితిన్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు.మిక్కీ జే మేయర్ సంగీతం చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ.ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, జయసుధ, ఆమని, అన్నపూర్ణ, గిరిబాబు, నరేష్ ముఖ్య పాత్రలు పోషించారు. సుమారు 60 మంది ఆర్టిస్టులు ఈ చిత్రంలో నటించారు.ఈ మద్యనే ఆడియో విడుదల కూడా అయ్యింది.

ఈ చిత్రం ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విజయవాడలోని కనదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. హీరోహీరోయిన్లు నితిన్, రాశీ ఖన్నా, నందితా శ్వేత, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు సతీష్ వేగేశ్న, నటుడు అజయ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయన సిబ్బంది వారికి అమ్మవారి ప్రసాదాన్ని, చిత్ర పటాన్ని అందజేశారు.

వాస్తవానికి ‘శ్రీనివాస కళ్యాణం’ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. అయితే ఏపీ ప్రేక్షకులకు దగ్గరవ్వాలనే ఉద్దేశంతో ఏపీ టూర్ మొదలుపెట్టారు. బుధవారం మొదట ద్వారకా తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న టీమ్ అక్కడి నుంచి విజయవాడ వెళ్లింది. అమ్మవారిని దర్శించుకుని అనంతరం మీడియా సమావేశం నిర్వహించింది.