తనతో రెండు సినిమాలలో నటించిన హీరోయిన్ తో నితిన్ వివాహం..

651

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ లో నితిన్ ఒక్కడు.ఇతని పెళ్లి ఎప్పుడెప్పుడు అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.అయితే వాళ్ళ కోరిక త్వరలో నెరవేరబోతుంది. నితిన్ ప్రేమలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి.

త‌న‌తో వ‌రుస‌గా రెండు సినిమాల్లో న‌టించిన మేఘ ఆకాష్‌తో డీప్‌ ల‌వ్‌లో ఉన్నాడ‌ని, తొంద‌ర్లోనే పెళ్లాడేస్తాడ‌ని మీడియాలో క‌థ‌నాలొచ్చాయి.మేఘ ఆకాష్‌ తన ఇంట్లో అడగగా..ఓ ఏడాది పాటు ఆగాక ఇంకా ప్రేమ‌లోనే ఉంటే పెళ్లికి అంగీక‌రిస్తామ‌ని చెప్పారంట.నితిన్ ప్రస్తుతం శ్రీ‌నివాస క‌ళ్యాణం అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత నితిన్ పెళ్లి చేసుకుంటాడు అని అంటున్నారు.

`శ్రీ‌నివాస క‌ళ్యాణం` ముందు.. ఆ తర్వాత.. నితిన్ ప్ర‌వర్త‌న‌లో ఎంతో మార్పు వ‌చ్చింద‌ని చెబుతున్నారు.దానికి కారణం మేఘా ఆకాష్ అనే అంటున్నారు. మరి ఇప్పుడు ఈ ప్రేమకథ నిజమో కాదో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.