సెన్సేషనల్ స్పృష్టించిన తమిళ చిత్రం రీమేక్‌లో నితిన్?

296

టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలలో నితిన్ ఒకడు.ఎన్ని ప్లాప్ సినిమాలు వచ్చిన తట్టుకుని నిలబడ్డాడు.ఈ మధ్య నితిన్ చిత్రాలు వరుసగా నిరాశపరుస్తున్నాయి.చల్ మోహన్ రంగా శ్రీనివాస కళ్యాణం నిరాశపరిచాయి.అందుకే తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.ప్రస్తుతం నితిన్ వరుస చిత్రాలతో బిజీ అవుతున్నాడు.

Image result for nithin

ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శత్వంలో నితిన్ నటించేందుకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. చంద్రశేఖర్ ఏలేటి దర్శత్వంలో కూడా నితిన్ నటించబోతున్నాడట.ఇప్పుడు నితిన్ సుకుమార్ కాంబినేషన్ లో కూడా సినిమా రాబోతుందనే వార్తలు వచ్చాయి.అయితే నితిన్ తదుపరి చిత్రాల గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.

Related image

ఇటీవల విడుదలైన తమిళ చిత్రం రట్ససన్ చిత్రం సంచలన విజయం సాధించింది. విష్ణు విశాల్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. విడుదలై నెలరోజులు గడచినా ఆ చిత్రం గురించి ఇంకా మాట్లాడుకుంటున్నారు. థ్రిల్లర్ అంశాలతో సాగే ఈ చిత్రం నితిన్‌ని బాగా ఆకర్షించిందట. దీనితో ఈ చిత్ర తెలుగు రీమేక్ హక్కులని నితిన్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో హీరో పోలీసు అధికారి పాత్రలో కనిపిస్తాడు. మరో ప్రచారం ప్రకారం ఈ చిత్రంలో నితిన్ నటించడని, కేవలం నిర్మాతగా వ్యవహరిస్తాడని అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.