నిఖిల్ ముద్ర వ‌చ్చేస్తోంది

350

లవ‌ర్ బాయ్ నిఖిల్ త‌న కొత్త సినిమా ముద్రపై ఓ వార్త హైలెట్ అవుతోంది.. ఇప్పుడు నిఖిల్ ఫ్యాన్స్ ఈ వార్త‌తో సంబురంలో ఉన్నారు ఈసినిమా రిలీజ్ డేట్ ఫైన‌ల్ అయింది అని తెలుస్తోంది.. ఈ సెప్టెంబ‌ర్ నెలాఖ‌రుకి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ..ఈ సినిమాని న‌వంబ‌ర్ 8న విడుద‌ల చేయాలి అని చిత్ర‌యూనిట్ భావిస్తోంది..

Related image

ఈ సినిమాలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నారు… ఈ సినిమా తమిళ్ లో విజయం సాధించిన ‘కనితన్’ సినిమాకి రీమేక్ గా వ‌స్తోంది . ఒరిజినల్ వెర్షన్ ని డైరెక్ట్ చేసిన టి.ఎన్ సంతోషే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీంతో నిఖిల్ కు మ‌రో స‌క్సెస్ త‌న ఖాతాలో ప‌డిన‌ట్టే అని ఆయ‌న అభిమానులు టాలీవుడ్ ట్రేడ్ పండితులు అంటున్నారు.. అదే కాన్సెప్ట్ తో చిత్రం తెర‌కెక్కిస్తే తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా ఈసినిమా న‌చ్చుతుంది అని అంటున్నారు క్రిటిక్స్.. ఈ సినిమా పై క్రిటిక్స్ కూడా అద్బుతంగా తెర‌కెక్కించారు అని క‌నిత‌న్ కు కితాబిచ్చారు..

Image result for mudhra postersఈ సినిమాని ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు.. ఈచిత్రంలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్నారు. తమిళ యువ సంగీత దర్శకుడు సామ్ సి ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.. ఇప్ప‌టికే కిరాక్ పార్టీ రీమేక్ తో నిఖిల్ హిట్ అందుకున్నాడు తాజాగా మ‌రో హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.