కాస్టింగ్ కోచ్ మీద సెన్సేషనల్ కామెంట్స్ చేసిన నిహారిక 

478

ఇటివల కాలంలో సినీ పరిశ్రమలో ఎక్కువగ వినిపిస్తున్న మాట కాస్టింగ్ కౌచ్.శ్రిరెడ్డి ఈ విషయం మీద పెద్ద యుద్దమే చేసింది.కానీ తర్వాత సైలెంట్ అయిపోయింది.శ్రిరెడ్డి సైలెంట్ అయిపోయిన ఈ విషయం మాత్రం సైలెంట్ కాలేదు.పలువురు హీరోయిన్లు కూడా ఈ కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన నిజాలు బయటపెట్టారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కూడా కాస్టింగ్ కౌచ్ పై స్పందించింది.ఆమె ఏమన్నదంటే..

క్యాస్టింగ్ కౌచ్ ఒక్క సినీ పరిశ్రమలో మాత్రమే ఉందని చెప్పడం కరెక్ట్ కాదు.ప్రతి రంగంలో ఇలాంటివి ఉన్నాయని తాను చాలా ఘటనల గురించి విన్నానని తెలిపింది. ఎవరైన ఒప్పుకుంటేనే ఏదైనా జరుగుతుందని చెప్పింది. నీ ప్రమేయం లేకుండా జరిగితే అది రేప్ కిందకు వస్తుందని తెలిపింది.

ఏదైన జరిగిపోయాక వాళ్లు అది చేశారు.వీళ్లు ఇది చేశారు అని చెప్పడం కరెక్ట్ కాదని నాకు ఇది తప్ప మరో దారి లేదని అనుకుంటేనే దానికి సిద్దపడాలని చెప్పుకొచ్చింది. తాను వాళ్ల స్థానంలో ఉండి మాట్లాడలేనని ఎందుకంటే తన బ్యాగ్రౌండ్ వేరని తెలిపింది.మరి నిహారిక వ్యాఖ్యల మీద శ్రిరెడ్డి ఏమంటుందో చూడాలి..