నా పెళ్లి అలా జరిగితే నేను హ్యాపీ… నిహారిక

407

మెగా ఫ్యామిలీ నుంచి అందరు హీరోలే ఉన్నారు అని ఇంతకముందు అనుకునేవారు.కానీ ఇప్పుడు హీరోయిన్ కూడా ఉంది అని అంటున్నారు.ఒక మనసు చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయినా ఈమ ఆచితూచి సినిమాలు చేస్తుంది.నిహారిక కొణిదెల ప్రస్తుతం నటించిన చిత్రం హ్యాపీ వెడ్డింగ్ విడుదలకు సిద్దంగా ఉంది.

సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా నటించిన హ్యాపీ వెడ్డింగ్ ప్రమోషన్‌లో నిహారిక బిజీబిజీగా వుంది. ఓ ఇంటర్వ్యూ నిహారిక తన పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.చాలా మంది పెళ్లి చేసుకున్న వాళ్ళను చూసా..వారి వివాహాల్లో జరిగిన చిన్న చిన్న తప్పులు చూశాక.. అలా కాకుండా పద్ధతిగా పెళ్లి చేసుకోవాలనిపిస్తుందని నిహారిక తెలిపింది.

 

ఆ మధ్య కాలంలో మా అక్క సుస్మిత పెళ్లిని బాగా ఎంజాయ్ చేశానని చెప్పిన నిహారిక, తనకు ఊహ తెలిసిన తరువాత ఇంట్లో జరిగిన తొలి పెళ్లి అదేనని, సంగీత్ నుంచి ప్రతి కార్యక్రమమూ ఇంట్లోనే జరుగగా, చాలా అల్లరి చేశానని తెలిపింది. పెళ్లీడుకు వచ్చిన ప్రతి అమ్మాయికి తన పెళ్లి ఎలా జరగాలనే విషయమై కొన్ని కోరికలు వుండటం సహజమని తన వరకైతే పద్ధతిగా పెళ్లిచేసుకోవడమే ఇష్టమని చెప్పింది.