పెళ్లి విష‌యం పై క్లారిటీ ఇచ్చిన నిహారిక వ‌రుడు ఎవ‌రంటే

373

మెగా వారి అమ్మాయి నిహారిక వరుసగా చిత్రాల్లో నటిస్తూ కమర్షియల్‌ హీరోయిన్‌గా పేరు దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్ప‌టికే టాలీవుడ్ లో మెగా వార‌సురాలిగా సినిమాల‌ను చేసి అనుకున్న రేంజ్ లో పేరు సంపాదించింది. చిన్న సినిమాలే అయినా క‌మ‌ర్షియ‌ల్ గా నిర్మాత‌ల‌కు డ‌బ్బులు మిగులుస్తోంది. మ‌రీ ముఖ్యంగా మెగా వార‌సులు అంద‌రి సినిమాల‌తో పాటు ఆమె సినిమాలు కూడా పోటికి నిలుస్తున్నాయి.

ఈ క్రింది వీడియో చూడండి

ఈ అమ్మడు తాజాగా సూర్యకాంతం అనే చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. త్వరలో విడుదల కాబోతున్న చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో నిహారిక పాల్గొంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ఈ అమ్మడు తాజాగా తన పెళ్లి గురించి మాట్లాడి అందరికి ఆశ్చర్యం కలిగేలా చేసింది. తన పెళ్లిపై తనకు పూర్తిగా క్లారిటీ ఉందని, ఎలాంటి పుకార్లు నమ్మకుండా మా ప్రకటన కోసం వేచి చూడండి అంటూ నిహారిక చెప్పుకొచ్చింది.

Image result for niharika

నేను ఎప్పుడు పెళ్లి చేసుకునేది ఖచ్చితంగా చెప్పలేను. కాని నాకు 30 ఏళ్లు రాకముందే మాత్రం పెళ్లి చేసుకుంటాను అనేది నిజం. కుటుంబ సభ్యులు నాకు 30 ఏళ్లు రాకముందే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే నేను అప్పటి వరకు సాధ్యం అయినన్ని ఎక్కువ సినిమాలు చేసి మంచి నటిగా గుర్తింపు దక్కించుకోవాలని భావిస్తున్నాను అంటూ నిహారిక చెప్పుకొచ్చింది. ప్రేమ వివాహం మాత్రం కాదని, పూర్తిగా కుటుంబ సాంప్రదాయాల ప్రకారం పెద్దలు కుదిర్చిన వివాహం అంటూ నిహారిక క్లారిటీ ఇచ్చింది.

Image result for niharika
  పెళ్లి విషయంలో మా కుటుంబ సభ్యులదే తుది నిర్ణయం అని, ఎలాంటి అనుమానాలు తావు లేకుండా క్లారిటీ ఇచ్చేసింది. గత కొన్నాళ్లుగా నిహారిక ప్రేమలో ఉందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిహారిక ప్రేమ వార్తలను కొట్టి పారేసింది. మెగా ఫ్యాన్స్‌ నిహారిక పెళ్లికి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నట్లుగా అనిపిస్తోంది. మెగా ఫ్యామిలీ మొత్తంలో కూడా నిహారిక చాలా ప్రత్యేకం అంటూ అంతా అంటారు. అందుకే ఆమె పెళ్లి ప్రత్యేకం అయ్యి ఉంటుంది. మ‌రి మెగా వారి ఇంటికి అల్లుడు అయ్యేవారు ఎవ‌రు అనేది ఇప్పుడు పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది. చూడాలి ఎవ‌రా వ్య‌క్తి అనేది.