పూరి , రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ హీరోయిన్ ఈమెనే

179

సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్‌లో ఇస్మార్ట్ శంకర్ సినిమా వస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే. ‘డబుల్ ధిమాక్ హైదరాబాదీ’ అనే క్యాప్షన్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. రాజ్ తోట సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Image result for ismart shankar

ఈ సినిమా ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం బిజీగా షూటింగ్ జరుపుకొంటున్నది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించిన వార్త ఆసక్తిని రేపింది.

ఈ మూవీలో రామ్‌కు జోడీగా ‘మిస్టర్ మజ్ను’ ఫేమ్ నిధి అగర్వాల్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. ‘ఇస్మార్ట్ శంకర్’ ఈ ఏడాది మేలో విడుదల కానుంది.