మెగా హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన నిధి అగర్వాల్

333

ఒక్క సినిమాతో టాలీవుడ్ ను తనవైపుకు తిప్పుకుంది నిది అగర్వాల్.సవ్యసాచిలో నిధి నటనకు అందానికి అందరు ఫిదా అయ్యారు.ఇప్పటికే అక్కినేని చిన్న వారసుడు అఖిల్ సరసన నటిస్తుంది.ఇప్పుడు తన టాలెంట్ అందరికి తెలిసిపోయింది కాబట్టి వరుస అవకాశాలు వస్తున్నాయి.

Related image

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కంచనున్న చిత్రం ద్వారా వైష్ణవ్ తేజ్ తెరంగేట్రం చేయబోతున్నాడు. ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించనున్నారు.

Image result for nidhi agarval vaishnav tej

గతంలో బుచ్చిబాబు సుకుమార్ దర్శకత్వశాఖలో పనిచేశారు. రంగస్థలం చిత్రానికి కూడా రైటర్‌‌గా పనిచేశారు. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చనున్నారు. అయితే ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన నిధి అగర్వాల్ ఎంపికైనట్టు తెలుస్తోంది.