బాలక్రిష్ణను తండ్రిగా భావిస్తా…కానీ ఆయన మాత్రం నయనతార సంచలన వ్యాఖ్యలు..

940

శ్రీ రామ రాజ్యం చిత్రంతో మైమరిపించాక బాల కృష్ణ మరోసారి నయనతారతో కలిసి నటించనున్నారు. బాల కృష్ణ కొన్నేళ్ళ క్రితం నిలిచిపోయిన తన కలల చిత్రం నర్తనశాల చిత్రాన్ని తిరిగి మొదలు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. అప్పట్లో ప్రధాన పాత్ర సౌందర్య చెయ్యాల్సి ఉంది ఆవిడ మరణించాక ఈ చిత్రాన్ని నిలిపివేశారు.

కావాలంటే ఈ వీడియో చూడండి

శ్రీ రామ రాజ్యం చిత్రంలో నయనతార నటన నచ్చి బాలకృష్ణ ద్రౌపది పాత్ర గురించి ఆమెతో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. శ్రీ రామ రాజ్యం నిర్మాత యలమంచలి సాయి బాబా ఈ చిత్రాన్ని నిర్మించాబోతున్నట్టు తెలుస్తుంది. అన్ని సరిగ్గా జరిగితే బాలకృష్ణ అభిమానులకు పండగే. చూద్దాం ఈ పుకార్లు నిజమవుతాయో లేదో.

ఇక ఇదిఇలా ఉంటె బాలక్రిష్ణ.. నయనతార హిట్ పెయిర్‌గా చెప్పుకుంటుంటారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సింహా సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమాలో వీరి జంటను చూసిన తెలుగు ప్రేక్షకులు హిట్ పెయిర్‌గా చెబుతూ వచ్చారు.

అలాంటి జంట ఇప్పుడు జై సింహా పేరుతో మరో సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయి జనవరి 12వ తేదీన విడుదల కానుంది. సినిమా షూటింగ్ పూర్తిచేసుకున్న సంధర్భంగా నయనతార ఒక టివి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బాలక్రిష్ణను నా తండ్రిలాగా భావిస్తాను. ఆయన్ను చూస్తే రెండు చేతులు జోడించి దణ్ణం పెట్టాలనిపిస్తుంది. ఆయన అంటే ఎంతో గౌరవం నాకు. బాలక్రిష్ణతో కలిసి నటించడమంటే నాకు చాలా ఇష్టం. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో మరో అవకాశం నాకు బాలక్రిష్ణతో నటించేందుకు వచ్చింది.

షూటింగ్ పూర్తి చేసుకున్నాం. సినిమా భారీ హిట్టవుతుందన్న నమ్మకం నాకుంది. బాలక్రిష్ణను ఎప్పుడు చూసినా నా కుటుంబ సభ్యుడిలా ఫీలవుతానంటోంది నయనతార. నయనతార చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి.