గబ్బర్ సింగ్ దర్శకుడితో నాని నెక్ష్ట్ మూవీ…!

384

హరీష్ శంకర్…గబ్బర్ సింగ్ సినిమాతో అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయాడు..గబ్బర్ సింగ్ కు ముందు షాక్, మిరపకాయ్ వంటి సినిమాలను చేసినప్పటికీ గబ్బర్ సింగ్ అతని దశ దిశను మార్చేసింది…అతని తాజా చిత్రం డిజే ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయినా డీసెంట్ కలక్షన్స్ సాదించింది..అయితే ఆ సినిమా సమయంలో కొన్ని వివాదాలు హరీష్ శంకర్ ను ఇబ్బంది పెట్టాయి..ఆ సినిమా తరువాత దిల్ రాజు బ్యానర్ లోనే దాగుడు మూతలు అనే మల్టి స్టారర్ మూవీ ఉంటుందని ప్రకటించినప్పటికీ అది కార్య రూపం దాల్చలేదు..అదే కాదు దిల్ రాజు కాంపౌండ్ లో హరీష్ నెక్స్ట్ సినిమా ఉండదని కూడా క్లారిటీ వచ్చింది.

ఇదిలా ఉండగా తాజాగా హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ గురించి ఒక అప్ డేట్ వినిపిస్తోంది..హరీష్ తన తదుపరి సినిమాను నాచురల్ స్టార్ నాని తో చేయనున్నాడట..ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ వారు చేయనున్నారని సమాచారం..ఇంతకుముందు 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నాని కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే..ఇది వారికి నానితో సెకండ్ ప్రాజెక్ట్. హరీష్ ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్నాడట. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే హరీష్ ఓ మాస్ డైరెక్టర్. నాని ఫుల్ ఫ్లెడ్జ్ గా మాస్ అవతారంలో చేసిన సినిమాలేవీ పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. మరి ఈ మాస్ డైరెక్టర్ న్యాచురల్ స్టార్ ను ఎలా ప్రెజెంట్ చేస్తాడో వేచి చూడాలి. ఏదేమైనా హరీష్ – నాని కాంబో ఒక క్రేజీ ప్రాజెక్టే.