మరోసారి డాక్టర్ గా నాని..!

335

నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు..బిగ్ బాస్ హోస్టింగ్ కోసం కొంచెం గ్యాప్ ఇచ్చిన నాని సెప్టెంబర్ నుంచి జెర్సీ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడని సమాచారం..మళ్ళీ రావా దర్శకుడు గౌతమ్ దర్సకత్వంలో జెర్సీ రూపుదిద్దుకోబోతుంది.. క్రికెట్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో నాని రెండు పాత్రల్లో కనిపించనున్నారు . అందులో ఒకటి క్రికెటర్ గా తండ్రి పాత్రలో మరొకటి కొడుకుగా డాక్టర్ పాత్రలో నాని కనిపించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

నాని టాలివుడ్ కింగ్ నాగార్జున తో కలిసి నటిస్తున్న దేవదాస్ చిత్రంలో కూడా డాక్టర్ గా నటిస్తున్నాడు..ఈ సినిమాను శ్రీరాం ఆదిత్య దర్సకత్వం వహిస్తుండగా త్వరలో విడుదలకు సిద్దమవుతోంది..వరుస సినిమాల్లో నని డాక్టర్ పాత్ర ప్రేక్షకులను అభిమానులను ఎంతలా అలరిస్తాయో తెలియాలంటే ఈ సినిమాలు విడుదలయ్యేవరకూ ఆగాల్సిందే..