న‌ర్త‌న‌శాల రేటును చూసి భ‌య‌ప‌డుతున్న ఛాన‌ల్స్

472

ఇప్పుడు టాలీవుడ్ లో చిన్న చిన్న సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి.. ఇక తాజాగా హీరో నాగ‌శౌర్య కూడా త‌న సినిమాల జోరు చూపిస్తున్నా అవి హిట్ టాక్ తెచ్చుకోవ‌డం లేదు అనే చెప్పాలి… ఇటీవ‌ల విడుద‌ల అయిన క‌ణం – అమ్మ‌మ్మ‌గారిఇల్లు సినిమాలు ప‌రాజ‌యాలు అయ్యాయి.. ఇక ఛలో మంచి విజ‌యాన్ని ఇచ్చింది.. ఇప్పుడు న‌ర్త‌నశాల సినిమాలో న‌టిస్తున్నాడు నాగాశౌర్య‌….. ఛ‌లో`తో తొలి విజ‌యాన్ని అందుకున్న ఐరా క్రియేష‌న్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇది నాగ‌శౌర్య‌కు సొంత బ్యాన‌ర్‌. ఇదే బ్యాన‌ర్‌లో రెండో సినిమాగా `న‌ర్త‌నశాల‌` చేస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచ‌నాలు బాగా పెరిగిపోయాయి అనే చెప్పాలి.

Image result for narthansala

నర్త‌నశాల‌….శాటిలైట్ రేటు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ సినిమా శాటిలైట్ రేటును మూడు కోట్ల రూపాయ‌లకు పైనే నిర్ణ‌యించార‌ట‌. ఇంత రేటు చెప్ప‌డంతో కొనేందుకు ఎవ‌రూ ముందుకు రాలేదు అని తెలుస్తోంది…న‌ర్త‌న శాల రైట్స్ ఛ‌లో కంటే ఎక్కువ చెబుతున్నార‌ని ఛానెల్స్ చెబుతున్నాయి మ‌రి చూడాలి ఈ రైట్స్ ఏ ఛాన‌ల్ ద‌క్కించుకుంటుందో.