గ్యాంగ్ లీడ‌ర్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్లు చూసి షాకైన నాని

349

నాని సినిమాలకు ఇప్పుడు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ సినిమాతోనూ మార్కెట్ పెంచుకుంటూ వెళ్తున్నాడు ఈ హీరో. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఈ హీరో. దీనికి మంచి టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు తొలిరోజు ఎంత వసూళ్ళు రాబోతున్నాయనే విషయంపై చర్చ బాగానే జరుగుతుంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ట్రేడ్ దగ్గర లెక్కలను బట్టి చూస్తుంటే తొలిరోజు గ్యాంగ్ లీడర్ భారీ వసూళ్లపై కన్నేసింది. నాని కెరీర్లో ఇప్పటి వరకు ఎంసిఏ తొలిరోజు హైయ్యస్ట్ కలెక్షన్స్ తీసుకొచ్చిన సినిమా.

Image result for nani's gang leader

దీనికి రెండేళ్ల కిందే 9 కోట్ల వరకు షేర్ వచ్చింది. ఆ తర్వాత చేసిన సినిమాలకు ఆ స్థాయి వసూళ్ళు రాలేదు. ఇక ఇప్పుడు గ్యాంగ్ లీడర్ ఆ రికార్డ్ బద్ధలుకొడుతుంది అని అనుకున్నారు. ఓవర్సీస్ మార్కెట్లో కూడా భారీగానే ఓపెన్ అయింది గ్యాంగ్ లీడర్. విక్రమ్ కే కుమార్ సినిమాలకు ఉండే క్రేజ్ కూడా దీనికి హెల్ప్ అవుతుంది. మ‌రి తొలిరోజు క‌లెక్ష‌న్లు ఎలా ఉన్నాయో చూద్దాం.గ్యాంగ్ లీడర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ కొద్దిగా షాక్ ఇచ్చాయి. నాని రీసెంట్ మూవీస్ తో పోల్చితే బుకింగ్స్ చాలా స్లో గా స్టార్ట్ అయ్యాయి, దాంతో మొదటి రోజు సినిమా 3 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోవచ్చు అని అంతా అనుకున్నారు, కానీ రిలీజ్ రోజున సినిమా జోరు చూపుతూ దూసుకు పోయింది.

Image result for nani's gang leader

రెండు తెలుగు రాష్ట్రాలలో ఆన్ లైన్ టికెట్ సేల్స్ కన్నా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ జోరు అందుకుని మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల ఆక్యుపెన్సీ 40% వరకు ఓవరాల్ గా ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల సమయానికి వచ్చే సరికి 60% కి పైగా పెరిగింది. పూర్తీ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు తెలియాల్సి ఉండగా…వాటిని ఓవరాల్ గా జరిగిన ఆన్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి చూస్తె మొదటి రోజు 4 కోట్ల కి పైగా షేర్ ని అందుకోవడం ఖాయమని తేలింది. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్నీ పక్కగా ఉంటే మొదటి రోజు 4.5 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు.

ఈ క్రింద వీడియో చూడండి

ఇక్కడ గ్రోత్ బాగానే ఉన్నా ఓవర్సీస్ ప్రీమియర్ షోల విషయం లో సినిమా 0.18 మిలియన్ ప్రీమియర్ షో కలెక్షన్స్ తో ఓపెన్ అయింది… నాని కెరీర్ లో ఇది మరీ అద్బుతం కాకున్నా డీసెంట్ కలెక్షన్స్ లో ఒకటి అని చెప్పొచ్చు. ఇక్కడ ఒక్క చోటే నాని ఇతర సినిమా రేంజ్ లో ఓపెనింగ్స్ రాలేదు… కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో జోరు చూపి నాని స్టార్ పవర్ ని చూపించింది గ్యాంగ్ లీడర్ సినిమా…ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పు పొందటం తో ఇక సినిమా లాంగ్ రన్ లో జోరు చూపే అవకాశం ఉంది, వీకెండ్ బ్యాటింగ్ గట్టిగా చేస్తే బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం పెద్ద కష్టం కాదు… పెద్ద సినిమాలు పోటీకి మ‌రేవీ లేవు కాబ‌ట్టి, గ్యాంగ్ లీడ‌ర్ జోరు మ‌రో వారం పైనే దుమ్ముదులుపుతుంది అంటున్నారు ట్రేడ్ పండితులు. మ‌రి మీరేమంటారు మీ అభిప్రాయం సినిమాపై క‌లెక్ష‌న్ల‌పై కామెంట్స్ రూపంలో తెలియ‌చేయండి.