అనిరుధ్ కు ఆఫ‌ర్ ఇచ్చిన నాని

400

అతి చిన్న వ‌య‌సులోనే టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్నాడు, కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్.. అయితే తెలుగు సినిమాల‌కు కూడా స్వ‌రాలు కూర్చి ఇక్క‌డ కూడా మంచి ఫేమ్ సాదించాడు.. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా వ‌చ్చిన అజ్ఞాత‌వాసి సినిమాకు బాణీలు స‌మ‌కూర్చి.. తొలి సినిమాతోనే ట్రెండ్ సెట్ చేశాడు ఈ యంగ్ మ్యూజిక‌ల్ డైరెక్ట‌ర్ అనిరుథ్.

Image result for music director anirudh

అయితే హిట్ టాక్ వ‌చ్చినా త‌ర్వాత తెలుగు సినిమాల‌కు ఆయ‌న వ‌ర్క్ చేయ‌లేదు… దీంతో ఆయ‌న వ‌ర్క్ ని తెలుగు ద‌ర్శ‌కులు గుర్తించ‌లేదా, అనే సందిగ్ద‌త కూడా వ‌చ్చింది. ఇక ఎన్టీయార్‌తో త్రివిక్ర‌మ్ చేస్తున్న అర‌వింద స‌మేత‌కు కూడా మొద‌ట‌గా అనిరుధ్‌నే సంగీతం ఇస్తారు అని వార్త‌లు వినిపించాయి.. అయితే చివ‌ర‌కు ఆయ‌న కాదు అని థ‌మ‌న్ కు ఈ సినిమా అవ‌కాశం ఇచ్చారు త్రివిక్ర‌మ్ యూనిట్.

Image result for music director anirudh and nani

అయితే ఇప్పుడు తెలుగులో ఏ ప్రాజెక్ట్ చేయ‌ని అనిరుథ్ తాజాగా ఓ ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకున్నారు అనే వార్త‌లు వినిపిస్తున్నాయి..నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా గౌత‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా జెర్సీ.. ఈ సినిమాకి బాణీలు స‌మ‌కూర్చేందుకు నాని అనిరుధ్ కు ఛాన్స్ ఇచ్చార‌ట.. మ‌రి ఈ సినిమాతో ఎటువంటి మాయ చేస్తాడో చూడాలి ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ .