నాగార్జునలో నాకు నచ్చని చెడు లక్షణాలు ఇవే : నాని

301

నాగార్జున నాని కలిసి చేసిన మల్టీస్టారర్ సినిమా దేవదాస్.రష్మిక ఆకాంక్ష హీరోయిన్స్ గా నటించారు.శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. అశ్వినీదత్ నిర్మాత. ఈ సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.అందుకే ఈ సినిమా ప్రమోషన్ చేస్తున్నారు.సినిమా విడుదల సమయం దగ్గర పడటంతో వెరైటీగా ప్రమోషన్స్ చేస్తున్నారు యూనిట్ సభ్యులు.మొన్న నాని హబిట్ ఏమిటో చెప్తూ నాగార్జున వీడియో పోస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

Image result for nagarjuna tell nani addiction

 

ఇప్పుడు నాగార్జున గురించి చెబుతూ నాని ఒక వీడియో పోస్ట్ చేశాడు.నాగ్ సర్‌లో అన్నీ నచ్చని క్వాలిటీసే.. అంటూ మొదలు పెట్టిన నాని తనదైన స్టైల్‌లో నాగార్జున లైఫ్ స్టైల్ గురించి వివరించాడు. ‘‘పొద్దున్న పొద్దునే లేచిపోతారు.. టైమ్ అంటే టైమ్‌కి షూటింగ్‌కి వస్తారు.. టైమ్‌కి తింటారు.. టైమ్‌కి లంచ్ బ్రేక్ తీసుకుంటారు.. లంచ్ తర్వాత కూడా టైమ్‌కే వస్తారు.. టైమ్‌కి షూటింగ్ నుంచి వెళ్ళిపోతారు.

ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తారు.. లైఫ్‌ని ఎంజాయ్ చేస్తారు.. ట్రిప్‌లకు వెళ్తారు. షూటింగులు చేస్తారు.. అన్నీ టూ మచ్ ఆర్గనైజ్డ్‌గా చేస్తారు.. ఇవన్నీ కూడా చెడు లక్షణాలే. నాకు తెలిసి 2019 న్యూ ఇయర్‌కు ఎక్కడికి వెళ్లాలి, ఏం చేయాలి అనే విషయాల్ని ఆయన ఇప్పటికే ప్లాన్‌ చేసుకుని ఉంటారు. ఇంత ప్లానింగ్‌తో, ఇంత పర్‌ఫెక్ట్‌గా మీ స్నేహితుల్లో ఎవరైనా ఉంటే వెంటనే ట్యాగ్‌ చేయండి.. థట్స్ మై దేవా’’ అంటూ ముగించాడు నాని.