జెర్సీ టీజర్ : యు ఆర్ ది లూజర్ ఆఫ్ యువర్ లైఫ్

223

నాని ప్రస్తుతం మళ్ళిరావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శత్వంలో జెర్సీ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. నాని క్రికెటర్ గా నటిస్తున్నాడు. అర్జున్ అనే పాత్రలో నాని మెప్పించనున్నాడు.

 Nanis Jersey movie teaser release date announced

సూర్యదేవర నాగవంశీ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై పీడీవీ ప్రసాద్ ‘జెర్సీ’ని సమర్పిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ కనిపించింది.

ఇప్పుడు చిత్ర టీజర్ ను విడుదల చేశారు.‘‘నీ ఏజ్ ఇప్పుడు 36 అర్జున్.. ప్రొఫెషనల్ స్పోర్ట్స్ నుంచి రిటైర్ అయ్యే ఏజ్’ అనే వాయిస్ ఓవర్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది. ‘యు ఆర్ ది లూజర్ ఆఫ్ యువర్ లైఫ్’ అని నానికి చెప్పగా.. భావోద్వేగానికి గురయ్యే సీన్ ఆకట్టుకునేలా గౌతమ్ డిజైన్ చేశారు. ‘ఆపేసి ఓడిపోయినవాడున్నాడు కానీ.. ప్రయత్నించి ఓడిపోయిన వాడు లేడు’ అంటూ నాని చెప్పే డైలాగ్ స్ఫూర్తిని కలిగిస్తోంది. టీజర్‌ని బట్టి చూస్తే ఈ చిత్రం యూత్‌కి బాగా కనెక్ట్ అవడంతో పాటు.. ప్రతిఒక్కరికీ ఓ స్ఫూర్తిదాయక చిత్రంగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.