మళ్ళి తెర మీద సందడి చేయబోతున్న సమంత నాని జోడి ?

253

నాని సమంత జోడి తెర మీద చాలా బాగుంటుంది.ఈగ,ఏటో వెళ్ళిపోయింది మనసు చిత్రాల ద్వారా ప్రేక్షకులను అలరించారు.అయితే హీరో, హీరోయిన్లుగా వారి కాంబినేషన్ మళ్ళి ఎప్పుడని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఫ్యాన్స్ కలల్ని నిజం చేసేందుకు నాని, సమంత మరోసారి జతకట్టనున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి.

Related image

తమిళంలో విడుదల కాబోతున్న 96 చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించేందుకు దిల్ రాజు హక్కులను సొంతం చేసుకొన్నాడు.ఈ హక్కుల కోసం దాదాపు రూ.1 కోటి చెల్లించినట్టు సమాచారం.విజయ్ సేతుపతి, త్రిషా జంటగా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 4న రిలీజ్ కానున్నది.అయితే ఈ చిత్రం తెలుగు వెర్షన్‌లో నాని సరసన సమంత నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Image result for nani samantha

ఇటీవలే నానికి దిల్ రాజు ఈ సినిమాను చూపించగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది.అలాగే సమంత కూడా ఈ చిత్రం పట్ల చాలా ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తుంది.అయితే ఈ విషయం గురించి దిల్ రాజు పీఆర్వో వంశీ కాక మాట్లాడుతూ.. 96 చిత్రాన్ని తెలుగులో రూపొందించాలని అనుకొంటున్న విషయం వాస్తవమే. కానీ త్వరలోనే నటీ, నటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడిస్తాం అని ఓ ప్రకటనలో తెలిపారు.చూడాలి మరి ఈ జోడీని తెర మీద చూసే అవకాశం వస్తుందో లేదో.