మా మధ్య ఆ బంధం ప్రెగ్నెంట్ అయితే తప్పేంటి నందిత శ్వేత సంచ‌ల‌న కామెంట్స్

494

ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో తెలుగులో అడుగుపెట్టిన హీరోయిన్ నందిత శ్వేత ప్రస్తుతం బ్లఫ్ మాస్టర్ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ చిత్రంలో పలు రకాల షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తాను. నా నటనకు గుర్తింపు పొందే పాత్రలో నటిస్తున్నాను అని చెప్పింది ఈ అందాల భామ‌. బ్లఫ్ మాస్టర్ చిత్రం డిసెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.బ్లఫ్ మాస్టర్ నాకు తెలుగులో మూడో సినిమా. తమిళంలో ఘన విజయం సాధించిన షతురంగ వేట్టై చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రంలో నేను అవని అనే పాత్ర పోషించాను. నేను కంటెంట్ ఉన్న చిత్రాలను మాత్రమే చేస్తాను చెప్పాను. అలాగే బ్లఫ్ మాస్టర్ చాలా కంటెంట్ ఉన్న మూవీ. తమిళ సినిమాను పోల్చితే తెలుగులో చాలా మార్పులు చేశారు. మంచి సినిమా చేసినందుకు గర్వంగా ఉంది.

Image result for నందిత శ్వేత
బ్ల‌ఫ్ మాస్టర్ చిత్రంలో నేను తప్ప అందరూ మోసం చేసేవాళ్లే. పాజిటివ్ అప్రోచ్ ఉన్న క్యారెక్టర్. అమాయకురాలి పాత్రలో కనిపిస్తాను. అవని చాలా కష్టమైన క్యారెక్టర్. ఆన్‌స్క్రీన్ అమాయకపాత్రలు చేయాలంటే చాలా కష్టం. ఆడియెన్స్ మెప్పు పొందేలా నటించాను. పాత్రకు పూర్తి న్యాయం చేశాను. ప్రేక్షకుల మెప్పు కోసం ప్రయత్నిస్తున్నాను.బ్లఫ్ మాస్టర్ చిత్రంలో నేను మూడు రకాలు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాను. లవర్, గృహిణిగా, ప్రెగ్నెంట్ ఉమెన్‌గా నటించాను. ప్రెగ్నెంట్ పాత్రలో కనిపిస్తే తప్పేంటే అని నందితా శ్వేత అన్నారు. రకరకాల పాత్రల్లో నటించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఫెర్ఫార్మెన్స్ పాత్రలే చేస్తున్నాను. తల్లి పాత్రల్లో, స్కూల్ విద్యార్థిగా, పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాను. హీరోయిన్ పాత్రలే కాదు.. నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లో నటిస్తాను. దర్శకులు నన్ను హీరోయిన్‌గా కంటే నటిగానే చూస్తున్నారు. అందుకే నేను విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్నాను.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

గతంలో నేను హీరో సత్యదేవ్ సినిమాలు చూడలేదు. బ్లఫ్ మాస్టర్ చిత్రానికి ముందు నన్నే ఎంపిక చేశారు. ఈ సినిమాలో నందిత శ్వేత తప్ప మరొకరిని తీసుకోను అని దర్శకుడు గోపీ గ‌ణేష్ చెప్పారు. దర్శకుడు గోపితో నాకు మంచి బాండింగ్ ఏర్పడింది. ఇప్పుడు మా మధ్య అన్న, చెల్లెల్ల బంధంగా మారింది. షూటింగ్ సమయంలో నన్ను బాగా చూసుకొన్నారు.2008లో కన్నడ చిత్రంలో నటించడం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాను. నా మొదటి సినిమాలో దారుణంగా నటించాను. ఆ తర్వాత గ్యాప్ తీసుకొని నేను నటనలో శిక్షణ పొందాను. ఆ తర్వాత తమిళ, తెలుగు, కన్నడ చిత్రాల్లో వరుసగా సినిమాలు చేస్తున్నాను. ప్రస్తుతం అభినేత్రి2, ప్రేమకథాచిత్రం2, అక్షర లాంటి చిత్రాల్లో నటిస్తున్నాను అని నందిత శ్వేత చెప్పారు.మరి ఆమె కామెంట్ల పై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.