సామ్రాట్ ప్యాంటు లోపల చేయిపెట్టిన నందిని.. అక్కడే గోకు అంటూ

1940

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 షోలో ఆసక్తికరమైన టాస్క్ ల పరంపర కొనసాగుతోంది. ఇంటి సభ్యుల సత్తా పరీక్షించేందుకు బిగ్ బాస్ విభిన్నమైన టాస్క్ లని ప్రయోగిస్తున్నారు. గత రాత్రి జరిగిన ఈ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బిగ్ బాస్ ఇంటి సభ్యులని పైరేట్స్ టీం, సర్వైవర్స్ టీంగా విభజించి ఈ టాస్క్ చేయమని ఆదేశించారుఇంటి సభ్యులు నిద్ర లేచే సమయానికే టాస్క్ సిద్ధంగా ఉంది. బయట గార్డెన్ లో టాస్క్ కు సంబందించిన ప్లాంక్స్ సిద్ధంగా ఉన్నాయి. నియమ నిబంధనల్ని బిగ్ బాస్ సిద్ధంగా ఉంచారుటాస్క్ లోని నిబంధనల్ని కౌశల్ ఇంటి సభ్యులకు చదివి వినిపించాడు. గంట మోగిన సమయం నుంచి సర్వైవర్స్ టీమ్ ప్లాన్క్స్ పై కూర్చోవాలి. పైరేట్ టీం వారిని కిందకు దించేలా ప్రయత్నించాలి. అడుగు కింద పెడితే ఆ సర్వైవర్ అవుట్ అయిపోయినట్లే.
బ్రష్ చేయకుండానే గంట మోగగానే ఇంటి సభ్యులు రెండు టీమ్స్ గా విడిపోయి గేమ్ మొదలు పెట్టారు. నేనింకా బాత్ రూమ్ కు వెళ్ళలేదు అంటూ గణేష్ పరుగులు పెట్టడం విశేషంసర్వైవర్స్ టీం సభ్యులంతా ఎవరి ప్లాన్క్స్ పై వారు కూర్చున్నారు. నిబంధన ప్రకారం సర్వైవర్స్ అడుగు కింద పెట్టకూడదు. రోజు మొత్తం అలానే ఉండాలి. దీనితో సర్వైవర్స్ టీం సభ్యులు బ్రష్ చేయకుండానే అరటిపండ్లు తినేశారు. పైరేట్స్ వచ్చి గేమ్ ప్రారంభించారు.దీప్తి సునైనా చాలా సులువుగా ఆరంభంలోనే అవుట్ అయిపోయింది. పైరేట్స్ ప్లాంక్ ని ఎత్తి పడేయడంతో సునైనా కింద పడిపోయింది. ఆ వెంటనే రోల్ రైడ కూడా అవుట్ అయిపోయాడు. పైరేట్స్ టీం లోని బాబు సర్వైవర్స్ కు దెబ్బలు తగల కుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

 నిబంధనలకు విరుద్ధంగా

సర్వైవర్స్ టీం లోని దీప్తిని కిందకు దించే భాద్యత కౌశల్, నందిని తీసుకున్నారు. ప్లాంక్ ని కౌశల్ తిరగేయడానికి ప్రయత్నించడంతో దీప్తి కాలు అందులో ఇరుక్కుపోయియింది. నొప్పితో దీప్తి బోరున ఏడ్చేసింది. సముదాయించుకు మళ్లీ ఆడారుఎత్తి పడేయడం, మీరుకింద పది ఏడవడం ఎందుకు ఇందంతా.. మీ చేయి అందించండి రచ మర్యాదలతో తీసుకుని వెళతా వెళతా అంటూ కౌశల్ దీప్తిని ఆటపట్టించే ప్రయత్నం చేశాడు. కానీ దీప్తి చివరి వరకు పోరాడింది.సామ్రాట్ ని కిందకు నందిని చిలిపిగా ప్రయత్నించింది. బుట్టలో ఉన్న ఎండు చేపని తీసుకుని సామ్రాట్ ప్యాంటు కింది భాగం నుంచి లోపల వేయడానికి ప్రత్నించింది. ఎండు చేపలని పైరేట్ ఓ ఆయుధంగా ఉపయోగించుకున్నారు.
గంట మోగగానే

దీప్తి కాలు ఇరుక్కుపోయిన వ్యవహారంలో కౌశల్, నందిని ఒకరిపై ఒకరు నిండా వేసుకున్నారు. వీవెందుకు పడేశావు అని నందిని అంటే, నీవెందుకు పట్టుకోవడానికి ప్రయత్నించేలేదు. అప్పటికి నేను నెమ్మదిగానే ప్లాంక్ ని తిరగేయడానికి ప్రయత్నించా అని కౌశల్ అన్నాడు. వీరిద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది.ప్లాంక్ ని కదిలించడం, తిరగేయడం వంటివి చేసి గేమ్ ఆడకూడదు. ఈ విషయాన్ని బిగ్ బాస్ తెలియజేయడంతో తిరిగి గేమ్ ప్రారంభించారు. ఈ సారి పైరేట్స్ ఇంకా చిలిపిగా ప్రయత్నించారు. చేపల వాసన చూపి కిందకు దించే ప్రయత్నం చేశారు.గీత మధురికి చేపల వాసన పడదు అని పైరేట్స్ అర్థం చేసుకున్నారు. దీనితో గీత మధురికి ఎండు చేపల వాసన చూపించే ప్రయత్నం చేసారు. వాటి నుంచి ఆమె తప్పించుకునే ప్రయత్నంలో పొరపాటున కాలు కింద పెట్టేసింది. దీనితో అవుట్ అయిపోయింది.

మరో మారు నందిని సామ్రాట్ వద్దకు వెళ్లి చిలిపిగా ప్రవర్తించింది. అతడి శరీరంపై ఎండు చేపని వేసింది. ఎండు చేపతో అతడి చెవిలోకి పొనిచ్చింది. షర్ట్ లోపల వీపు పై ఎండు చేప వేయడానికి నందిని ప్రయత్నించగా.. అక్కడే గోకు బాగా అంటూ సామ్రాట్ ప్రోత్సహించాడు. చివరకు తాళ్లతో కట్టి అందరిని బయటకు లాగేశారు.టాస్క్ పూర్తయ్యాక గీత, కౌశల్ మధ్య ఆధిపత్యపోరు సాగింది. ఇంటి కెప్టెన్ ని నేను. బిగ్ బాస్ ఆదేశించిన నిబంధనల్ని సభ్యులకు చదివి వినిపించాల్సింది నేను. కానీ మీరెందుకు చదివారు అంటూ గీత కౌశల్ ని ప్రశ్నించింది. మీరు ఉండగానే చదివాను కదా అని కౌశల్ తెలిపాడు. నేను చెప్పక ముందే మీరు చదివేశారు అని గీత అసహనం వ్యక్తం చేసింది.

కాపు రిజర్వేషన్లపై పవన్ ఏమన్నారంటే.