కౌశల్ దెబ్బకి నందిని అవుట్ డైల‌మాలో ప‌డిన బాబుగోగినేని

436

ఏమైన్నా జ‌ర‌గ‌చ్చు అంటూ బిగ్ బాస్ షోలో, టాస్క్ లతో హౌస్ లో మ‌రింత మజా అందిస్తున్నారు బిగ్ బాస్ టీం.. కంటెస్టెం దైర్యానికి ప‌నికి ఇక్క‌డ ఓ ప‌రీక్ష పెడుతున్నారు అని చెప్ప‌వ‌చ్చు.. ఇక లోక‌నాయకుడు బిగ్ బాస్ కు ఈ వారం రావ‌డం అక్క‌డ ఉన్న కంటెస్టెంట్స్ అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది….బిగ్ బాస్ హౌస్ ఫ్రెండ్ షిప్‌డే సందడితో హోరెత్తింది.ఇక బిగ్ బాస్ కంటిస్టెంట్స్ నాని టీవీ ద్వారా మాట్లాడుతూ.. ఫ్రెండ్ షిప్ డే రోజు మీతో డైరెక్ట్‌గా మాట్లాడాలని ఉంది కాని.. హౌస్‌లోకి ఇప్పుడు రావడం కుదరడం లేదు అని.. బిగ్ బాస్ హౌస్ గోడను నిచ్చెన ద్వారా ఎక్కి కంటెస్టెంట్స్‌తో ముచ్చటించారు . త‌ర్వాత ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా తమ జీవితంలో జరిగిన స్వీట్ మెమొరీస్‌ను ప్రేక్షకులతో పంచుకున్నారు కంటెస్టెంట్స్. గూడ‌చారి టీం చిల‌సౌ టీం నానితో క‌లిసి కంటెస్టెంట్స్ తో కాసేపు స్టేజ్ పై నుంచి మాట్లాడారు

Image result for nandini rai out of the house
ఇక ఈ వారం కీలకమైన ఎలిమినేషన్‌లో కౌశల్, బాబు గోగినేనిలు నిన్నటి ఎపిసోడ్‌లో సేఫ్‌ జోన్‌లోకి రాగా.. గణేష్, దీప్తి, నందినిలు మాత్రమే మిగిలారు. వీళ్లలో ముందు గణేష్ సేఫ్ జోన్‌లో ఉన్నట్టు ప్రకటించిన నాని.. తరువాత దీప్తిని కూడా సేఫ్ చేసి మిగిలిన నందినిని బిగ్ బాస్ హౌస్‌ నుండి ఎలిమినేషన్‌ ద్వారా సాగనంపారు. అయితే నందిని ఎలిమినేషన్‌కి నామినేట్ కావడంతో ఈ వారం నందిని ఔట్ కావడం ఖాయమే అంటూ ట్రోలింగ్స్ నడిచాయి. దీనికి కారణం ఆమె పదే పదే కౌశల్‌తో గొడవ పెట్టుకోవడం, తనీష్‌తో కౌగిలింతలు, కిస్‌లతో బాగా దగ్గర కావడంతో ఆమెను బిగ్ బాస్ హౌస్‌ నుండి ప్రేక్షకులు ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ చేశారు. దీంతో బాబు గోగినేని షాక్ అయ్యారు ఇప్ప‌టికే ఈ వారం కౌశ‌ల్ గీతా వీరిలో ఎవ‌రినో ఒక‌రిని బ‌య‌ట‌కు పంపుతా అని గ‌త వారం బాబు గోగినేని కామెంట్ చేయ‌డం అంద‌రికి తెలిసిందే.. దీంతో నందిని హౌస్ నుంచి వెళ్లిపోవ‌డంతో బాబు షాక్ అయ్యారు.

ఎలిమినేషన్ త‌ర్వాత జరిగే బిగ్ బాంబ్ ఏదైనా నందిని ఖచ్చితంగా కౌశల్‌పైనే విసురుతుందని అంద‌రూ భావించారు.. కాని ఇక్క‌డ నందిని అంద‌రికి ట్విస్ట్ ఇచ్చింది నందిని. బిగ్ బాంబ్ శిక్ష ప్రకారం హౌస్‌లో ఉన్న వాళ్లకి మసాజ్ చేయాలని శిక్ష ఉండటంతో ఈ బిగ్ బాంబ్‌ను రోల్ రైడాపై విసిరింది. అయితే తాను బిగ్ బాస్‌ను వీడితూ ఎలాంటి వివాదాస్పదమైన కామెంట్స్ చేయకుండా పాజిటివ్‌ మైండ్‌తోటే బిగ్ బాస్ హౌస్‌ను వీడింది నందిని. అయితే నందిని బిగ్ బాస్ హౌస్‌ను వీడటంతో తనీష్ బాగా ఎమోషన్ అయ్యారు. ఆమెకు తనదైన శైలిలో స్ట్రాంగ్ హగ్ ఇచ్చి మరీ భారంగా బయటకు పంపించాడు.