నందమూరి కుటుంబం ప్రాణాలు తీస్తున్న కార్ నెంబర్.. చూస్తే షాక్!

471

నందమూరి కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. నందమూరి తారక రామారావు కుమారుడు, సినీ హీరో, టీడీపీ నేత హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. నల్గొండ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా కావలి వస్తుండగా అన్నేపర్తి దగ్గర డివైడర్‌ను ఢికొట్టిన కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. దీంతో కారులోంచి బయటకు పడిపోయిన హరికృష్ణకు తలకు, శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి హరికృష్ణను స్థానికులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు చికిత్స అందించేందుకు ప్రయత్నించినా.. ఆయన శరీరం సహకరించకపోవడంతో కన్నుమూశారు.

Related image

నందమూరి కుటుంబ సభ్యులకు జరుగుతున్న వరుస ప్రమాదాలు నందమూరి అభిమానులను కలవరపెడుతున్నాయి. ఒకే జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రమాదానికి గురి కావడం అందర్నీ షాక్ లో పడేస్తోంది. నాలుగేళ్ల కిందట నల్లగొండ జిల్లా మునగాల మండలం ఆకుపాము వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ మృతి చెందాడు. 2014 డిసెంబరు 6 న హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా, ఆయన ప్రయాణిస్తున్న వాహనం ట్రాక్టర్‌ను తప్పించబోయి బోల్తాపడింది. ఈ ప్రమాదం లో ఆయన అక్కడిక్కడే మరణించారు.

Image result for nandamuri harikrishna car number

నాడు తనయుడి మరణవార్త తెలియగానే కుప్పకూలిపోయిన హరికృష్ణ.. దేవుడు నన్ను మోసం చేశాడంటూ రోదించారు. పెద్ద కుమారుడి మాదిరిగానే ఆయన కూడా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అందర్నీ బాధ పెడుతోంది. అంతకు ముందు 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున ప్రచారం చేసిన నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా నల్లగొండ జిల్లా మోతే ద‌గ్గ‌ర ఆయన ప్రయాణిస్తోన్న వాహనం ప్రమాదానికి గురయ్యింది. దేవుడి దయ వల్ల ఎన్టీఆర్ గాయాలతో బయటపడ్డాడు. ఇప్పుడు అదే జిలాల్లో హరికృష్ణ రోడ్డు ప్రమాదం లో మరణించారు. దీంతో నందమూరి కుటుంబాన్ని వరుస రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయని అంతా మాట్లాడుకుంటున్నారు.

Image result for nandamuri harikrishna car number

ఇక ఈ స‌మ‌యంలో ఇక్క‌డ కారు ప్ర‌మాదాలు జ‌రిగిన తీరు చూస్తుంటే 17-02-2014 న ఆయ‌న పెద్ద కుమారుడు జాన‌కి రామ్ ప్ర‌యాణిస్తున్న కారు ప్ర‌మాదానికి గురి అయింది… ఈ కారు నంబ‌ర్ ఇప్పుడు హ‌రికృష్ణ ప్ర‌యాణం చేసిన కారునెంబ‌ర్ ఒక‌టే కావ‌డంతో, ఈ నెంబ‌ర్ కార్లు ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఎంతో కీడుచేస్తున్నాయి అని క‌లిసి రావ‌డం లేదు అని అంటున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

AP 29 BD 2323 ఈ కారు హ‌రికృష్ణ ప్ర‌మాదానికి గురైన కారు.
AP 28 BW 2323 ఈ కారు హ‌రికృష్ణ కుమారుడు జాన‌కి రామ్ ప్ర‌మాదానికి గురి అయిన కారు.

ఈ రెండు కారు నెంబ‌ర్లు చూస్తుంటే 2323 కామ‌న్ గా ఉంది.. ఇక ఈ నెంబ‌ర్ ఎన్టీఆర్ ఫ్యామిలికి క‌లిసి రాలేదు అని అంటున్నారు.. మొత్తానికి ఈ నెంబ‌ర్ చూస్తుంటే ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎంత‌టి విప‌త్క‌ర ప‌రిస్దితిని ఈ ప్ర‌మాదంతో ఎదుర్కొంది అని అంటున్నారు ఆ కుటుంబ స‌భ్యులు…అలాగే నంద‌మూరి అభిమానులు ఇప్ప‌టికే ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఇలా విషాదాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. మొత్తానికి ఈ కారు నెంబ‌ర్ విషయం వెనుక ఉన్న నిజం వాస్త‌వం ఏమిటి అనేది తెలియాలి.. ఇప్ప‌టికే ఈ కారు ప్ర‌మాదాలు ఎన్టీఆర్ ఫ్యామిలికి ఎంతో తీర‌ని మ‌నోవేధ‌న మిగిల్చాయి అనే చెప్పాలి… చూశారుగా ఈవీడియోపై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.