హరి కృష్ణ చనిపోయే ముందు రాసిన లేఖలో ఏముందో తెలిస్తే కన్నీళ్లు ఆపుకోలేరు

378
నందమూరి హరికృష్ణ మృతితో నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తీవ్ర విషాదంలో ఉన్నారు. ఆయన మరణం తీరని లోటని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సెప్టెంబర్ 2న పుట్టినరోజు జరుపుకోవాల్సిన వ్యక్తి ఇలా అకాలంగా చనిపోవడం దురదృష్టకరమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆయన రాసిన లేఖను తలచుకొని బాధపడుతున్నారు. అభిమానుల్ని ఉద్దేశించి ఆయన ఓ లేఖ రాశారు.. అందులో వారికి ఓ సందేశాన్ని ఇచ్చారు.
nandamuri harikrishna last letter to fans
హరికృష్ణ తన లేఖలో.. ‘సెప్టెంబర్ 2న అరవై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరపవద్దని నా మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళ రాష్ట్రంలో వరదలు, వర్షాలు కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులైనారు. ఇది మన అందరికీ ఎంతో విషాదాన్ని కలిగించే విషయం.
Image result for harikrishna nandamuri
అందువల్ల నా జన్మదినం సందర్భంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, పుష్ప గుచ్ఛాలు, దండలు తీసుకురావద్దని వాటికి అయ్యే ఖర్చును వరదలు, వర్షాలు కారణంగా నష్టపోయిన కుటుంబాలకు అందజేయాలని కోరుతున్నాను. అంతేకాకుండా, నిరాశ్రయులైన వారికి దుస్తులు, వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు మీ శక్తి మేరకు అందజేయాలని కోరుతున్నాను’ ఇట్లు- మీ నందమూరి హరిక‌ృష్ణ అంటూ ముగించారు.
ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ లేఖ గురించి తలచుకొని అభిమానులు శోకంలో మునిగిపోతున్నారు. నిరాడంబరంగా ఉండే వ్యక్తి.. కిందిస్థాయి కార్యకర్తు, అభిమానిని సైతం ఆప్యాయంగా పలకరించేవాడని ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అలాంటి వ్యక్తి ఇక లేడన్న విషయాన్ని నమ్మలేకపోతున్నామని కన్నీరు పెట్టుకుంటున్నారు.