నేడు హ‌రికృష్ణ పెద్ద క‌ర్మ ఈ కార్య‌క్ర‌మానికి నంద‌మూరి ఫ్యామిలీ ఎక్క‌డికి వెళ్లి ఏమి చేస్తున్నారో తెలుసా

401

గత నెల 29న జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ దుర్మరణం చెందారు. నెల్లూరు జిల్లాలో ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి ఫార్చ్యునర్ వాహనంలో బయల్దేరిన ఆయన నల్లగొండ జిల్లా అన్నెపర్తి దగ్గర ప్రమాదానికి గురయ్యారు. వేగంగా డివైడర్‌ను ఢీకొట్టిన కారు ఎగిరి అవతలి రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో హరికృష్ణ తల, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. నార్కెట్‌పల్లిలోని కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు..

Image result for harikrishna

ఇక నేడు టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ పెద్ద కర్మను కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. నెక్లస్ రోడ్డులోని జలవిహార్ గ్రాండ్స్ లాన్స్‌లో ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం 12.30 నుంచి ప్రారంభంకానున్న ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్నారు.. అలాగే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఏపీ సీఎం సహా ప్రముఖులు హాజరుకానుండటంతో నెక్లస్ రోడ్డు, జలవిహార్ ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటుచేశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

సీఎం చంద్ర‌బాబుతో పాటు ఏపీకి చెందిన‌ ప‌లువురు నాయ‌కులు సినీ ప్ర‌ముఖులు రానుండ‌టతో ఇక్కడ పెద్ద ఎత్తున అభిమానులు కూడా చేరుకుంటారు అని పోలీసులు భావించారు.. అందుకే ఇక్క‌డ ప్ర‌త్యేక భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు.. ఇక నంద‌మూరి కుటుంబం, ఎన్టీఆర్ కుమారుడు కుమార్తెలు, వారి కుటుంబ స‌భ్యులు అంద‌రూ హాజ‌రు అవుతారు అని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ క‌ల్యాణ్ రామ్ అలాగే ఆయ‌న సోద‌రులు అంద‌రూ ఈ కార్య‌క్ర‌మానికి రానున్నారు.. ఇటు నంద‌మూరి కుటుంబంలో చాలా మంది కృష్ణా జిల్లా నుంచి ఇప్ప‌టికే ఇక్క‌డ‌కు చేరుకున్నారు అని చెబుతున్నారు.