హరికృష్ణ చనిపోయాడు.. మరి మా పరిస్థితి ఏంటి?

457

అతివేగం, సీటుబెల్టు లేని ప్రయాణం నందమూరి వారింట విషాదాన్ని నింపడంతో పాటు… మరో నలుగురు యువకుల జీవనాధారాన్ని ప్రశ్నార్థకం చేసింది. నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న హరికృష్ణ కారు అదుపు తప్పి అన్నేపర్తి వద్ద డివైడర్‌ను తాకుతూ ఎదురుగా వస్తున్న మరో కారుపై పడింది.

Image result for harikrishna nandamuri car accident images

ఈ ఘటనలో.. కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఫొటోగ్రాఫర్లు శివ, భార్గవ్‌, ప్రవీణ్‌లకు గాయాలయ్యాయి. అంతేకాకుండా వీరికి సంబంధించిన కెమెరాలు, ఫొటోగ్రఫీకి సంబంధించిన ఇతర సామాగ్రితో పాటు కారు కూడా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన సమయంలో హరికృష్ణను నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించిన పోలీసులు… వీరిని కూడా ఆస్పత్రిలో చేర్చి వైద్య సదుపాయం కల్పించారు. కానీ హరికృష్ణ మృతదేహాన్ని తరలించిన తర్వాత తమను పట్టించుకునే నాథుడే కరువయ్యారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Image result for harikrishna nandamuri car accident images

ఫొటోగ్రాఫర్లుగా పనిచేస్తున్న ఆ యువకులు ఓ ప్రోగ్రామ్‌ నిమిత్తం చెన్నైకి వెళ్లి వస్తుండగా అనుకోని విధంగా హరికృష్ణ కారు రూపంలో ప్రమాదం ఎదురైంది. ఈ ఘటనలో వీరికి గాయాలు కాగా కెమెరాలు, ఫొటోగ్రఫీ సామాగ్రి సహా కారు కూడా ధ్వంసమైంది. అయితే ఆస్పత్రిలో చేర్చిన అనంతరం పోలీసులు తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. ‘మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వాళ్లం. ప్రస్తుతం మా చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. అప్పులు తెచ్చి మరీ కెమెరాలు కొనుగోలు చేశాం. అవే మా కుటుంబాలకు జీవనాధారం. రెపటి నుంచి ఎలా బతకాలి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

గాయాల నుంచి కోలుకుని తిరిగి పనిలో చేరేంత వరకు మమ్మల్ని ఎవరు పోషిస్తారు. మాకు ఎవరు న్యాయం చేస్తారంటూ’ ప్రవీణ్‌, శివ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హరికృష్ణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించిన ప్రభుత్వం.. తమకు కూడా సహాయం చేసి, కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలంటూ ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేస్తున్నారు. కాగా, గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు ముగిశాయి.

2019 ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గ MLA గా ఎవరు గెలుస్తారని భావిస్తున్నారు ?