నేను విలన్ గా చెయ్యడానికి సిద్ధం..కథ ఉంటె చెప్పండి : బాలకృష్ణ

282

నందమూరి నటవారసుడు బాలకృష్ణ విభిన్నమైన పాత్రలతో దాదాపు నాలుగు దశాబ్దాలపాటు ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు.హీరోగా ఆయన ఎన్నో ప్రయోగాలు చేశాడు.ఆదిత్య 369,భైరవద్వీపం,ఫ్యాక్షన్ సినిమాలు,భక్తిరస చిత్రాలు లాంటి ఎన్నో వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేశాడు. హీరోగా ఆయన నటించిన చిత్రాలు ఎక్కువగానే బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.

Image result for balakrishna

తాజాగా తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నారు. ఈ మధ్య దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డుల్లో పాల్గొన్నారు.గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రంలో అద్బుతమైన నటనకు గాను బాలకృష్ణ ఉత్తమ నటుడిగా సైమా అవార్డును అందుకొన్నారు.ఈ అవార్డు ఫంక్షన్ లో ఆయన విలన్ క్యారక్టర్స్ మీద కామెంట్స్ చేశాడు.

Image result for balakrishna

విలన్ క్యారెక్టర్స్ లో ఒక మజా ఉంటుంది.అవకాశం వస్తే తాను కూడా విలన్‌గా నటించాడనికి సిద్దమేనని ప్రకటన చేశారు.నెగిటివ్ రోల్స్ చేస్తే అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తారేమో,నా మీద కేసు పెడుతారెమొ అని చెప్పి అందరిని నవ్వించాడు.