బాలయ్య బోయపాటి కొత్త సినిమా కధేంటో తెలుసా…!

495

నటసింహం నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో గతంలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపాయి..వీరిద్దరి కాంబినేషన్ కు మాంచి క్రేజ్ ఉంది..మరోసారి వీరిద్దరి కాంబినేషన్ చూడాలన్నది నందమూరి అభిమానుల ఆశ…అయితే బాలకృష్ణ క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తో బిజీ గా ఉన్నారు..ఈ సినిమా తన కెరీర్ లోనే మైలురాయిగా నిలిచిపోవాలని బాలయ్య కఠోరంగా శ్రమిస్తున్నారు. కథ తయారు చేయడం నుంచి ప్రతి విషయంలోనూ హీరో కం నిర్మాతగా ఆయన ఎంతో కేర్ తీసుకుంటున్నారు. అందుకే బోయపాటి సినిమా గురించి ఆలోచించే టైమ్ లేదు…

అయితే బోయపాటి మాత్రం తన పని తాను చేసుకుపోతున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బాలయ్య తనతో మాత్రమే సినిమా చేయాలన్న పంతం చూపిస్తున్నాడు. అంతేనా బాలయ్య బాబు ఇమేజ్ కి తగ్గ స్క్రిప్టుని తయారు చేస్తున్నాడు. సింహా పొలిటికల్ జర్నీకి హెల్ప్ అయ్యే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథపై ఎం.రత్నంతో కలిసి సీరియస్ గా కసరత్తు చేస్తున్నారట. ఇదో సెటైరికల్ పొలిటికల్ డ్రామా. 2019 మిడిల్ లో ప్రారంభం అవుతుందని తెలిసింది. పొలిటికల్ సెటైరికల్ అంటే బాలయ్య శైలిలో పంచ్ డైలాగులకు ఆస్కారం ఎక్కువే ఉంటుంది. రాజకీయాలు కాబట్టి బ్రూటల్ ఫ్యాక్షన్ యాక్షన్ కి ఆస్కారం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. అంటే మరోసారి బాలయ్య-బోయపాటి బృందం మాస్కి మసాలా వేసి ఫుల్ మీల్స్ అందించబోతోందని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు బాలయ్య కోసం మాంచి మాస్ మసాలా స్క్రిప్టును రూపొందించే పనిలో మెగా డైరెక్టర్ వివి వినాయక్ బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే.