థాంక్స్ మావయ్య..మీ ప్రేమే మమ్మల్ని నడిపిస్తుంది..కృష్ణను ఉద్దేశించి నమ్రత భావోద్వేగ పోస్ట్

266

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా కొనసాగుతున్నాడు. ఎన్నో కార్పొరేట్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఇటీవల హైదరాబాద్‌లో మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ పేరుతో భారీ మల్టీప్లెక్సుని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

కృష్ణ చేతుల మీదుగా

అత్యాధునిక హంగులతో ఇంద్రభవనాన్ని తలపించేలా ఏఎంబి సినిమాస్ ను నిర్మించాడు.మల్టిప్లెక్స్ ప్రారంభోత్సవానికి సూపర్ స్టార్ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ వేడుకలో మహేష్, నమ్రత దంపతులు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

 సేవా కార్యక్రమాలు

ఏఎంబి సినిమాస్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలని మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తన మావయ్య సూపర్ స్టార్ కృష్ణని ఉద్దేశిస్తూ ఎమోషనల్ కామెంట్ చేశారు. మీ ప్రేమ, మద్దత్తతోనే తాను, మహేష్ ముందుకు సాగుతున్నాం అని నమ్రత పోస్ట్ చేశారు. మా వెన్నుండి నడిపించే శక్తి మీరే, అందుకు ధన్యవాదాలు అంటూ నమ్రత కృష్ణకు కృతజ్ఞతలు తెలియజేసింది.