కేవలం సమంత కోసం సినిమా ఒప్పుకున్న యంగ్ హీరో నాగశౌర్య

306

సమంత ప్రధాన పాత్రలో నందినిరెడ్డి దర్శకత్వంలో సౌత్ కొరియన్ కామెడీ డ్రామా ‘మిస్ గ్రానీ’కి రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే.ఓ 70 ఏళ్ళ వృద్ధురాలు, 20 ఏళ్ళ అమ్మాయిగా మారుతుంది. ఆ సమయంలో పడుచు శరీరంలో వున్న ముసలి బామ్మ ఏం చేసిందనేది కథ. 70 ఏళ్ళ బామ్మలా, 20 ఏళ్ళ అమ్మాయిలా… రెండు డిఫరెంట్ షేడ్స్ వున్న క్యారెక్టర్ కనుక సమంత ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Related image

అయితే ఈ సినిమాలో ఇప్పుడు హీరో నాగశౌర్య నటించబోతున్నాడని టాక్ వచ్చింది.అయితే ఈ సినిమా హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో హీరో పాత్రకు అంత ప్రాధాన్యముండదు.అయితే సమంతతో నాగశౌర్య ఇప్పటివరకూ నటించలేదు. ఆమెతో నటించే అవకాశం రావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని సమాచారం.

Related image

కానీ దర్శకురాలు నందినిరెడ్డికి ఇచ్చిన మాట కోసం ఈ సినిమాలో నాగశౌర్య కనిపిస్తున్నాడనే టాక్ కూడా వచ్చింది. నందినిరెడ్డి దర్శకత్వంలో ఇప్పటికే నాగశౌర్య ‘కల్యాణ వైభోగమే’ చేశాడు. ఆమె దర్శకత్వ శైలి గురించి అవగాహన వుంది.అందుకే ఈ సినిమా ఒప్పుకున్నాడని నాగశౌర్య సన్నిహితులు అంటున్నారు..