రాజ‌కీయాల్లోకి నాగార్జున భార్య అమ‌ల ఆ పార్టీలో టికెట్ ఫిక్స్

456

ఏపీ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో కొద్ది రోజులుగా అక్కినేని ఫ్యామిలీ పొలిటికల్ ఎంట్రీ పై జోరుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే నంద‌మూరి, మెగా కాంపౌండ్స్ నుండి ప‌లువురు రాజ‌కీయాల్లోకి రాగా, అక్కినేని ఫ్యామిలీ నుండి మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వ‌లేదు. అయితే కొద్ది రోజులుగా అక్కినేని నాగార్జున‌, ఆయ‌న స‌తీమణి అక్కినేని అమ‌ల రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస్తున్నార‌ని వార్త‌లు జోరుగా ప్ర‌చారం అవుతున్నాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఆ ఫ్యామిలీ నుండి ఎలాంటి క‌న్ఫ‌ర్‌మేష‌న్ రాక‌పోగా, ఆ వార్త‌ల‌ను కూడా ఖండిచ‌లేదు.

Image result for nagarjuna and amala

ఇక అసలు మ్యాట‌ర్ ఏంటంటే అక్కినేని నాగేశ్వ‌ర‌రావు వార‌సుడిగా ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున స్టార్ హీరోగా ఎదిగారు. ప్ర‌స్తుతం త‌న ఇద్ద‌రు కుమారుల‌ను ఇండస్ట్రీలో నిల‌బెట్టే ప‌నిలో ఉన్న నాగార్జున.. ఒక‌వైపు సినిమాల‌తో, మ‌రోవైపు వ్యాపారాల‌తో బిజీ బిజీగా గడుపుతున్నారు. వివాదాల‌కు ఎక్కువ‌గా దూరంగా ఉండే నాగార్జున రాజ‌కీయాల్లో వ‌స్తారా అంటే ఆయ‌న సన్నిహితులు అవున‌నే అంటున్నారు… దివంగత ఉమ్మ‌డి ఏపీ మాజీ ముఖ్య మంత్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఉన్న‌ప్పుడు నుండే వైఎస్ ఫ్యామిలీతో మంచి సంబంధాలు కొన‌సాగిస్తున్నారు అక్కినేని ఫ్యామిలీ… జ‌గ‌న్‌తో కూడా నాగ్‌కు మంచి స్నేహ‌మే ఉంది. దీంతో నాగార్జున వైసీపీలోకి చేర‌బోతున్నాడ‌ని, అలాగే ఆయ‌న భార్య అమ‌ల కూడా వైసీపీ చేర‌నుంద‌ని వార్త‌లు జోరుగా ప్ర‌చారం అవుతున్నాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

గ‌తంలో స‌ర్గీయ నందమూరి తార‌క‌రామారావు పార్టీ పెట్టిన‌ప్పుడే అక్కినేని నాగేశ్వ‌ర‌రావుని ఆహ్వానించ‌గా ఆయ‌న సున్నితంగా తిర‌స్క‌రించారు. అయితే అప్పుడు రాజ‌కీయాలు, చిత్ర ప‌రిశ్ర‌మ వేరువేరుగా ఉండేవి.. అయితే ఇప్పుడు మాత్రం సినీ ప‌రిశ్ర‌మ‌- పాలిటిక్స్ దాదాపుగా క‌లిసిపోతున్నాయి. దీంతో ఆ ఎఫెక్ట్ కొంత‌మంది పై ప‌డుతోంది. ఆ ప్ర‌భావ‌మే మనం లాంటి ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన చిత్రానికి నంది అవార్డు ఇవ్వ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మ‌ని భావించేవాళ్ళు కూడా ఉన్నారు. దీంతో అప్ప‌టి నుండే నాగార్జున కూడా రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు. దీంతో త్వ‌ర‌లోనే ఈ ఇద్ద‌రు వైసీపీలో చేర‌నున్నార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఈ ఇద్ద‌రిలో ఒక‌రిని అసెంబ్లీ నుండి మ‌రొక‌రిని లోక్‌స‌భ నుండి బ‌రిలోకి దించ‌నున్నార‌ని తెలుస్తోంది… గుంటూరు, విజ‌య‌వాడ నుండి ఈ ఇద్ద‌ర‌ని బ‌రిలోకి దించ‌నున్నార‌ని జ‌గ‌న్ నిర్ణ‌యం కూడా తీసేసుకున్నార‌ని స‌మాచారం. మ‌రి ఈ వార్త‌లో నిజ‌మెంత ఉందో తెలియ‌దు కానీ నాగార్జున‌, అమ‌ల‌లు వైసీపీలో చేరితే ఆ పార్టీకి ఫుల్ పాలోయింగ్ పెరుగుతుంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.మ‌రి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ ల రూపంలో తెలియ‌చేయండి.