మరో యంగ్ హీరోతో నాగార్జున మల్టీస్టారర్..

512

టాలీవుడ్ సీనియర్ హీరోల ఆలోచన సరళి మారుతున్నట్లు కనిపిస్తోంది. కొత్తదనంతో ఆడియన్స్ ని మెప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. వెంకటేష్, నాగార్జున వంటి హీరోలు మల్టీస్టారర్ కథలపై ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే వెంకటేష్ చాలా మల్టిస్టారర్ సినిమాలు చేశాడు.ఇప్పుడు నాగార్జున కూడా ఈ పద్దతిని పాటిస్తున్నాడు.నాగార్జున ప్రస్తుతం నానితో దేవదాస్ అనే మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు.

దేవదాస్

ఇదిలా ఉండగా నాగార్జున తదుపరి ప్రాజెక్ట్ గురించి క్రేజీ న్యూస్ ప్రచారం జరుగుతోంది.నాగార్జున ఒక యంగ్ హీరోతో మల్టీస్టారర్ చిత్రంలో నటించేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. శర్వానంద్, నాగార్జున కలసి నటించేందుకు సన్నాహకాలు జరుగుతున్నట్లు టాక్ వస్తుంది.ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ సంస్థ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఓ యువ దర్శకుడు దీనికి దర్శకుడిగా చెయ్యబోతున్నాడంటా.

నాగార్జున లాంటి పెద్ద స్టార్ తో మల్టీస్టారర్ చిత్రంలో నటించడం శర్వానంద్ కు ఇదే తొలిసారి కానుంది. త్వరలోనే దర్శకుడు నాగార్జున, శర్వానంద్ కు కథ వినిపించబోతున్నాడట. హీరోలనుంచి గ్రీన్ సింగ్నల్ వస్తే సెట్స్ పైకి వెళ్లడం ఖాయం అని అంటున్నారు.చూడాలి మరి ఈ మల్టిస్టారర్ మొదలవుతుందో లేదో.మొదలైతే ఇండస్ట్రీకి మంచిదే అని అంటున్నారు సినీ పండితులు.