స‌మంతకు గిప్ట్ ఇచ్చిన నాగార్జున

478

నిజ‌మే అక్కినేని వారి కోడ‌లు స‌మంత‌కు నాగ్ గిఫ్ట్ ఏమిటి అని అనుకుంటున్నారా. అస‌లు విష‌యంలోకి వ‌స్తే ఏ ఏడాది వ‌రుస సినిమాల విడుద‌ల, అలాగే విడుద‌ల అయిన ప్ర‌తీ సినిమా విజ‌య ప‌రంప‌ర కొన‌సాగుతుండ‌టంతో,న‌టి స‌మంత చాలా హ్యాపీగా ఉంది. ఇప్ప‌టికే తెలుగు త‌మిళ భాష‌ల్లో ఆమె హిట్లు అందుకుంది అలాగే అగ్ర‌తార‌గా కొన‌సాగుతోంది.

Related image

నటి సమంత అక్కినేని. ప్రస్తుతం నటిస్తున్న యు టర్న్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను నిన్న విడుదల చేశారు. ఈ సంధర్బంగా ఆమె అభిమానులతో ట్విట్టర్ ద్వారా ముచ్చటించారు. అయితే ఈ స‌మ‌యంలో కొంద‌రు అభిమానులు ఆమెని ప‌లు ప్ర‌శ్న‌లు అడిగారు.. మీకు మీ మావ‌య్య నాగార్జున ఇచ్చిన అతి పెద్ద బ‌హుమ‌తి ఏమిటి అని అడిగారు.

Image result for nagarjuna giving gift for sam

చైతు తో పెళ్లి కి అంగీకరించడమే ఆయన నాకు ఇఛ్చిన పెద్ద బహుమతి అని సమంత రిప్లై ఇచ్చారు… ఇక నాకు మామ‌య్య నాగార్జున ఇన్స్పిరేష‌న్ అని ఆమె తెలియ‌చేశారు. ఇక పెళ్లి త‌ర్వాత చైతూ – స‌మంత కొత్త సినిమా నేడు సెట్స్ పైకి వెళ్లనుంది.. ఈ సినిమాని నాగ్ చేతుల మీదుగా ప్రారంభించ‌నున్నారు అని తెలుస్తోంది.