నానికి స్టేజ్ పైనే వార్నింగ్ ఇచ్చిన నాగార్జున.

431

బిగ్ బాస్ షో స్టార్ట్ అయ్యినప్పటి నుంచి బిగ్ బాస్ మీద ఎవరో ఒకరు కామెంట్స్ చేస్తున్నారు.మొదట్లో కంటిస్తంట్స్ బాగా లేరని అన్నారు. ఆ తర్వాత నాని హోస్టింగ్ బాగా లేదని అన్నారు.షో ఎలాగోలా సాగుతుంది కదా అనుకునే లోపే బిగ్ బాస్ లీక్స్ ఆ షో యాజమాన్యాన్ని కలవర పెట్టాయి.ఇవన్నీ ఒక ఎత్తు అయితే కౌశల్ ఆర్మీ అనేది ఇప్పుడు మరింత తలనొప్పి అయ్యింది బిగ్ బాస్ టీమ్ కు.కౌశల్ ఆర్మీ ఏం అనుకుంటే అది బిగ్ బాస్ హౌస్ లో జరుగుతుంది అనేంతవరకు వచ్చింది పరిస్థితి.అందుకే బిగ్ బాస్ ఒక నిర్ణయం తీసుకుని లాస్ట్ వీక్ వారికి నచ్చని నూతన నాయుడును కావాలని ఎలిమినేట్ చేసింది.ఇప్పుడు ఈ విషయం మీదనే నాగార్జున బిగ్ బాస్ టీమ్ ను క్లాస్ పీకడంట.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for big boss telugu

బిగ్ బాస్ స్టార్ట్ అయ్యాకా కొన్ని రోజులకు కౌశల్ కు సపోర్ట్ గా కౌశల్ ఆర్మీ అనేది స్టార్ట్ అయ్యింది.ఆ తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి.ఎంతలా అంటే కౌషల్ ఆర్మీ మాటనే బిగ్ బాస్ మాటగా అయ్యాయి.కౌశల్ ఆర్మీ ఏం అనుకుంటే అదే జరిగింది.అందుకే బిగ్ బాస్ ఈ ఆపడం తొలగించుకోడానికి ఒక నిర్ణయం తీసుకుంది.లాస్ట్ వీక్ కౌశల్ కు తోడుగా ఉన్న ఒకే ఒక్క స్నేహితుడు నూతన నాయుడును ఎలిమినేట్ చేసింది.అతనికి ఓట్లు మంచిగా వచ్చినా కూడా కౌశల్ ను ఒంటరి వాడిని చేసి కౌశల్ ఆర్మీ చెప్పినట్టు మేము చెయ్యడం లేదు అని నిరూపించుకోడానికి బిగ్ బాస్ టీమ్ అతనిని ఎలిమినేట్ చేసింది.అయితే మొన్న నూతన నాయుడు ను ఎలిమినేట్ చేసినప్పటి నుంచి బిగ్ బాస్ మీద విపరీతమైన ట్రోల్స్ జరుగుతున్నాయి.

Image result for nagarjuna

ప్రజల ఓటింగ్స్ ను పట్టించుకోకుండా మీరే ఎలిమినేట్ చేస్తే ఇక మేమెందుకు చూడాలి అని ప్రజలు నిప్పులు చల్లుతున్నారు.ఈ వివాదం తారాస్థాయికి చేరడంతో మా టీవీ యజమానుల్లో ఒకరైన నాగార్జున ఈ విషయంలో కల్పించుకున్నాడంట.నాగార్జున నానిని పిలిచి కాస్త మందలించడంట.అలాగే బిగ్ బాస్ యాజమాన్యానికి కూడా మొట్టికాయలు వేశాడంట.మీరు ఇలా చేస్తే మా టీవీ చూడడం ప్రజలు మానేస్తారని మంచి పేరు ఉన్న బిగ్ బాస్ కు చెత్త పేరు తీసుకురావద్దని హెచ్చరించాడంట.ప్రజలు ఓట్లు వేస్తున్నారు.వారికి ఎవరైతే నచ్చుతారో వారికి ఓట్లు వేస్తారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

వారు ఎవరికీ తక్కువ ఓట్లు వేస్తారో వారిని ఎలిమినేట్ చెయ్యండి.అంతేకానీ మీ ఇష్టప్రకారం ఎలిమినేట్ చెయ్యడం ఏమిటి అని బిగ్ బాస్ యాజమాన్యాన్ని క్లాస్ పీకారంట.ఇకపై ఆ తప్పు చెయ్యమని బిగ్ బాస్ యాజమాన్యం నాగార్జునకు వివరణ ఇచ్చిందంట.చూశారుగా ఇదండీ జరిగినది.మరి ఈ విషయం మీద మీరేమంటారు.బిగ్ బాస్ తమకు ఇష్టం ఉన్నవారిని ఎలిమినేట్ చెయ్యడం గురించి అలాగే బిగ్ బాస్ యాజమాన్యాన్ని నాగార్జున క్లాస్ పీకడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.