నాని అడిక్షన్ గురించి చెప్తూ నాగార్జున వీడియోను పోస్ట్ చేసిన దేవదాస్ చిత్ర బృందం..

284

నాగార్జున నాని కలిసి చేసిన మల్టీస్టారర్ సినిమా దేవదాస్.రష్మిక ఆకాంక్ష హీరోయిన్స్ గా నటించారు.శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. అశ్వినీదత్ నిర్మాత. ఈ సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.అందుకే ఈ సినిమా ప్రమోషన్ చేస్తున్నారు.

Related image

ఇప్పటికే బిగ్ బాస్ షో కు వచ్చిన నాగార్జున రష్మిక ఆకాంక్ష ప్రమోషన్ ను షురూ చేశారు.ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం నాని అడిక్షన్ గురించి నాగ్ చెబుతున్న వీడియోను రిలీజ్ చేసింది.ఆ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది.

‘‘వన్ మినిట్.. ఆ ఏంటి అడిగావ్? ఓ దట్స్ ద హ్యాబిట్. సమయమంతా ఫోన్‌లోనే గడిపేస్తాడు. ఏం చూస్తాడో ఆ ఫోన్‌లో నాకు తెలియదు. పక్కన ఒక అందమైన అమ్మాయి కూర్చున్నా కూడా చూడడు. ఈ ఫోన్‌నే చూస్తా ఉంటాడు. ఏంటో నాకు తెలియదు’’ అని నవ్వుతూ చెప్పుకొచ్చారు నాగ్. నాని ఫోన్ చూస్తున్న విజువల్స్‌ని కూడా చూపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది దేవదాస్ చిత్రబృందం.