అక్కినేని ఇంట మన్మథుడు 2 ఎవ‌రు ?

368

టాలీవుడ్ న‌వ మ‌న్మ‌థుడు అక్కినేని నాగార్జున అనే చెబుతారు ఎవ‌రైనా… ఆయ‌న బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో మ‌న్మ‌థుడు సినిమా ఒక‌టి..విజయ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగ్‌ నిజంగా మన్మథుడు లాగే ఆకట్టుకున్నాడు. అమ్మాయిలను ద్వేషించే పాత్రలో కూడా అమ్మాయిల కలల రాకుమారుడిగా కనిపించాడు కింగ్‌. ఇక ఈ సినిమాకు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ క‌లం ప‌నిచేసింది.. ఆయ‌న డైలాగుల్ పంచ్ లు అదిరిపోయాయి.

Related image

ఇక ఈ సినిమా గురించి ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతోంది.. తాజాగా కింగ్ నాగార్జున మన్మథుడు 2 అనే టైటిల్‌ను ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్‌ చేయించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మన్మథుడు సినిమాకు నాగ్‌ సీక్వెల్‌ ప్లాన్‌ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.. అయితే ఈ సినిమాలో నాగార్జున న‌టిస్తారా, లేదా ఆయ‌న త‌న‌యులు చైత‌న్య అఖిల్ లో ఎవ‌రైనా న‌టిస్తారా అని అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు… మ‌రి దీనిపై ఇంకాస్త స‌మ‌యం రివీల్ చేసేందుకు ప‌డుతుంది.. ఎందుకంటే ఇప్పుడు వ‌రుసగా ముగ్గురూ సినిమాల‌తో బిజీబిజీగా ఉన్నారు.